Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఇంగ్లాండ్ సెమీస్‍ భవితవ్యం తేలేది నేడే.. ఓడితే ఇంటికే..

England will face Sri Lanka in Sydney as part of T20 World Cup 2022 on Saturday

టీ20 వరల్డ్ కప్2022లో శనివారం కీలక మ్యాచ్ జరగనుంది. గ్రూప్-1 నుంచి మధ్యాహ్నం సిడ్నీలో శ్రీలంకతో ఇంగ్లాండ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది. ఒక వేళ శ్రీలంక గెలిస్తే గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్తుంది. అంటే ఆస్ట్రేలియా సెమీస్ భవితవ్యం శ్రీలంక చేతిలో ఉంది. అయితే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ వెళ్లింది. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోటో పడుతున్నాయి.

గ్రూప్-1 నుంచి పాయింట్ల పరంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 7 పాయింట్లతో ఉన్నాయి. కానీ రన్ రేటు లో న్యూజిలాండ్ మెదటి స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ రెండు స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలిస్తే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఏడేసి పాయింట్లతో ఉంటాయి.. కానీ పరంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మెరుగైన స్థితిలో ఉండి సెమీస్ కు వెళ్తాయి. ఇదే గ్రూప్-1 నుంచి ఇప్పటికే శ్రీలంక, ఐర్లాండ్, ఆఫ్ఘానిస్తాన్ నిష్ర్కమించాయి. శ్రీలంక రెండు మ్యాచ్ ల్లో గెలువగా.. ఐర్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఇక ఆఫ్ఘానిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.

ఇక గ్రూప్-2 నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్ కు వెళ్లడం లాఛనంగా కనిపిస్తుంది. అయితే ఆదివారం జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలిస్తే ఎలాంటి అటంకాలు లేకుండా సెమీస్ కు వెళ్తుంది. ఒక వేళ ఓడిపోతే రన్ రేట్, పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ గెలుపు, సౌతాఫ్రికా నెదర్లాండ్స్ గెలుపుపై ఇండియా సెమీస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. గ్రూప్-2లో భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 4 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. అయితే రన్ రేటు పరంగా సౌతాఫ్రికా, పాకిస్థాన్ భారత్ కంటే ముందున్నాయి.

Story first published: Saturday, November 5, 2022, 7:18 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+