
Ashes series: సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఇంతలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఈ నెల 14 నుంచి హోబర్ట్ వేదికగా జరగనున్న యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అధికారికంగా వెల్లడించాడు. సిడ్నీ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేస్తుండగా బట్లర్ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ గాయంతోనే బట్లర్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు. బట్లర్ గాయం తీవ్రమైనదని చెప్పిన రూట్.. స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలిపాడు. చివరి టెస్టు మ్యాచ్‌లో బట్లర్ జట్టులో లేకపోవడం నిరాశ కల్గించే అంశమన్నాడు. కాగా గాయపడ్డ బట్లర్ స్థానంలో 30 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ జట్టులో చేరనున్నాడు.
అంతేకాకుండా సిడ్నీ టెస్టు మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్రం పోషించిన బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ కూడా మ్యాచ్‌లో గాయపడ్డారని జో రూట్ తెలిపాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ చేతి బోటన వేలికి గాయమైనట్లు రూట్ చెప్పాడు. అలాగే బెయిర్‌స్టో కూడా గాయపడ్డాడని తెలిపాడు. సిడ్నీ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో స్టోక్స్ హాఫ్ సెంచరీలు సాధించగా, బెయిర్‌స్టో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో రాణించాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఇంగ్లండ్ బ్యాటర్‌గా బెయిర్‌స్టో నిలిచాడు. అయితే ప్రస్తుతం గాయపడడంతో వీరిద్దరు ఐదో టెస్టు మ్యాచ్‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. హోబర్టు వెళ్లాక అక్కడ తమ ఫిజియోథెరపీ స్టోక్స్, బెయిర్‌స్టోను పరీక్షించి నిర్ణయం తీసుకుంటారని రూట్ చెప్పాడు. ఈ గాయాలు తమ జట్టుకు నష్టం చేకుర్చేవేనని అన్నాడు. అలాగే సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు బాగా ఆడారని కొనియాడాడు. మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో రాణించిన బెయిర్‌స్టో, స్టోక్స్‌పై రూట్ ప్రశంసలు కురిపించాడు.
బ్రిస్బేన్, ఆడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ జట్టు నేడు సిడ్నీ వేదికగా ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసకుంది. తద్వారా వైట్ వాష్ నుంచి తప్పించుకోవడంతోపాటు మరో ఓటమి నుంచి తప్పించుకుంది. కాగా కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న ఇంగ్లండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్, బౌలింగ్ కోచ్ జోన్ లూయిస్ ఐదో టెస్టుకు జట్టులో చేరనున్నారు.