Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండిస్ పర్యటనను క్లీన్‌స్వీప్‌‌తో ముగించిన ఇంగ్లాండ్‌

England in West Indies: Hosts bowled out for 71 as tourists claim eight-wicket win

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో ఇంగ్లాండ్ పర్యటన ముగిసింది. మూడు టి20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3-0తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో కరీబియన్‌ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ 13 ఓవర్లలో 71 పరుగులే చేసి ఆలౌటైంది.

తొలి బంతికే హోప్‌ (0) వికెట్‌ చేజార్చుకున్న విండీస్‌.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 45 పరుగులకే ఆలౌటైంది. అయితే క్యాంప్‌బెల్‌ (11), హోల్డర్‌ (11), పూరన్‌ (11), మెక్‌కాయ్‌ (10)లు రెండంకెల స్కోర్లు చేయడంతో 50 పరుగులైనా దాటగలిగింది. దీతో విండీస్‌ చెత్తరికార్డును లిఖించుకుంది.

వరుస మ్యాచ్‌ల్లో కనీసం 75 పరుగుల్లోపే ఆలౌటైన జట్టుగా నిలిచింది. రెండో టి20లో విండీస్‌ 45 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్‌ విల్లే (4/7) కెరీర్‌‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. వుడ్‌ మూడు, రషీద్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి గెలిచింది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో 37, హేల్స్‌ 20 పరుగులు చేశారు. విల్లేకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఆల్‌రౌండర్‌ జోర్డాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు లభించాయి.

Story first published: Tuesday, March 12, 2019, 10:50 [IST]
Other articles published on Mar 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+