T20 World Cup 2022: సెమీస్‍కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్.. లంకపై గెలుపు..

టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్ సెమీస్‍కు దూసుకెళ్లింది. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో శ్రీలంకపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు. నిస్సాంక 45 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. భానుక రాజపక్స 22 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు.

మార్క్ వుడ్
వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ 14 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 18 పరుగులు చేశాడు. ధనుంజయ డిసిల్వా 9, చరిత్ అసలంక 8, కెప్టెన్ దాసున్ షనక 3, హసరంగ 9 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్ల పడగొట్టాడు. అదిల్ రషీద్, బెన్ స్టోక్స్, వోక్స్, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.

అలెక్స్ హెల్స్
142 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఛేదనలో తొలుత ధాటిగా ఆడిన ఇంగ్లాండ్.. లంక స్పిన్నర్లు బరిలోకి దిగడంతో నెమ్మదించారు.మొదటగా 23 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన జోస్ బట్లర్ ఔటయ్యాడు. ఆ తర్వాత అలెక్స్ హెల్స్ ఔటయ్యాడు. హెల్స్ 30 బంతుల్లో ఒక సిక్స్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేశాడు.

బెన్ స్టోక్స్
అనంతరం వచ్చిన బ్రూక్స్, లివింగ్ స్టోన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కానీ బెన్ స్టోక్స్ ఆచితూచి ఆడాడు. స్టోక్స్ 36 బంతుల్లో 2 ఫోర్లతో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో లహిరు కుమార, హసరంగ, ధనుంజయ డిసిల్వా రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్లగా ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications