For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌ Vs విండీస్‌: తొలి డే-నైట్‌ టెస్టుకి సర్వం సిద్ధం

ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బర్మింగ్‌హమ్‌ వేదికగా తొలి డే-నైట్ టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బర్మింగ్‌హమ్‌ వేదికగా తొలి డే-నైట్ టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. రాత్రిపూట జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో గులాబి రంగు బంతితో ఆడతారు.

దీంతో ఈ టెస్టు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఆస్ట్రేలియాతో మొట్టమొదటిసారి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ స్వదేశంలో తొలిసారి ప్రయోగాత్మకంగా తొలిసారి డే-నైట్ టెస్టుకు ఆతిథ్యమిస్తోంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఐదో డే-నైట్ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

 England Vs West Indies: Joe Root and boys to play maiden day-night Test

ఈ ఐదు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 2015లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా మొట్టమొదటి డే-నైట్‌ టెస్టు మ్యాచ్ ఆడగా... ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లతో ఆడింది. క్రికెట్ అభిమానుల కోరిక మేరకు ఐసీసీ డే-నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహిస్తోంది.

డే-నైట్ టెస్టుల్లో ఎర్రబంతికి బదులుగా గులాబి బంతిని వాడతారు. ఎందుకంటే ప్లడ్ లైట్ల వెలుగుల్లో అటు బ్యాట్స్ మెన్లతో పాటు ఫీల్డర్లకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అంతకుముందు ఆస్ట్రేలియా డే-నైట్ టెస్టులు ఆడిన సందర్భంలో గులాబి కోకాబుర్రా బంతులను వాడితే ఇంగ్లండ్ మాత్రం గులాబి డూక్స్ బంతులను వాడుతుండటం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+