
స్టోక్స్ అరుదైన రికార్డు:
విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసాడు. మూడో రోజు ఆటలో విండీస్ బ్యాట్స్‌మన్ అల్జారీ జోసెఫ్‌ను స్టోక్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇది టెస్టుల్లో స్టోక్స్‌కు 150వ వికెట్ కావడం విశేషం. దీంతో టెస్టుల్లో వేగంగా 4వేల పరుగులు, 150 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. స్టోక్స్ 64 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ 63 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కేవలం ఆరుగురు మాత్రమే:
టెస్టుల్లో ఇప్పటి వరకు 4వేల రన్స్, 150 వికెట్లు తీసిన ఆటగాళ్లు కేవలం ఆరుగురు మాత్రమే. గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్), కపిల్ దేవ్ (భారత్), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), డేనియల్ వెటోరీ (న్యూజీలాండ్) మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, షేన్ డౌరిచ్ వికెట్లను పడగొట్టాడు.

తొలిసారి నాయకత్వం:
ఇంగ్లండ్ టెస్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో స్టోక్స్.. ఇంగ్లిష్ జట్టుకు 81వ సారథి అయ్యాడు. తొలి టెస్ట్ సందర్భంగా స్టోక్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బుధవారం నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. నాకు కెప్టెన్సీ కన్నా జట్టు గెలుపే ముఖ్యం. రూట్ గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం నా కర్తవ్యం. కానీ దృష్టి మొత్తం మ్యాచ్ గెలవాలనే దానిపైనే ఉంది' అని అన్నాడు.

బయో సెక్యూర్ వాతావరణంలో:
మామూలుగా అయితే ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదేమో. కానీ కరోనాతో వచ్చిన నాలుగు నెలల విరామం తర్వాత ఈ మ్యాచ్‌లపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ఇక బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ సఫలీకృతమైతే.. సిరీస్‌లు నిర్వహించాలని మిగిలిన దేశాల బోర్డులు కూడా చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications












