For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvWI: సిబ్లే, ‌స్టోక్స్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్!!

England vs West Indies 2nd Test: End of a long wait for Kemar Roach as Ben Stokes departs after Tea

మాంచెస్టర్‌: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. వైస్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్ (176; 356 బంతుల్లో 17x4, 2x6), ఓపెనర్ డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) సెంచరీలు బాదడంతో ఇంగ్లండ్ భారీ స్కోరుపై కన్నేసింది. రెండో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.

రెండో రోజు (శుక్రవారం) ఓవర్‌నైట్ 207/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సిబ్లే-‌స్టోక్స్ జోడీ క్రీజులో కుదురుకున్నప్పటికీ నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా సిబ్లే కేవలం సింగిల్స్ మాత్రమే తీశాడు. మరోవైపు స్టోక్స్ అడపాదడపా బౌండరీలు బాదాడు. దీంతో ఈ జోడీని విడదీసేందుకు వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తన వద్ద ఉన్న వ్యూహాలన్నీ ప్రయోగించాడు. కానీ ఫలితం మాత్రం రాబట్టలేకపోయాడు. స్టోక్స్ 255 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ మార్క్‌ని అందుకోగా.. సిబ్లే సెంచరీకి చేయడానికి 312 బంతులు తీసుకున్నాడు. సిబ్లే‌కి ఇది రెండో టెస్టు శతకంకాగా.. ‌స్టోక్స్‌కి పదో సెంచరీ.

తొలిరోజు 81/3తో నిలిచిన దశలో జత కలిసిన సిబ్లే-‌స్టోక్స్ జోడీ నాలుగో వికెట్‌కి ఏకంగా 260 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. అయితే జట్టు స్కోరు 341 వద్ద సిబ్లే పెవిలియన్ చేరగా.. టీ సమయానికి ముందు జోస్ బట్లర్ అండతో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపాడు. టీ అనంతరం బట్లర్ బ్యాట్ జులిపించగా.. రోచ్ దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో స్టోక్స్ (176), వోక్స్ (0) లను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్ (26), కరన్ (0) ఉన్నారు.

సౌథాంప్టన్ వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్.. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దాంతో సిరీస్‌పై ఇంగ్లండ్‌కి ఆశలు నిలవాలంటే మాంచెస్టర్ టెస్టులో తప్పక గెలవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్ టూర్‌లో బోణి కొట్టిన వెస్టిండీస్ జట్టులో మరింత ఉత్సాహం నింపే ఉద్దేశంతో క్రికెట్ వెస్టిండీస్ తాజాగా ఆటగాళ్లకు బోనస్ ప్రకటించింది. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిస్తే.. విండీస్ జట్టుకి సుమారు రూ. 23 లక్షలు బోనస్‌గా ఇవ్వనున్నట్లు సీడబ్లూ‌ఐ ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

Story first published: Friday, July 17, 2020, 21:40 [IST]
Other articles published on Jul 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+