For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Sri Lanka: నా తల్లి, భార్య కూడా తిట్టారు.. అందరికి క్షమాపణలు చెపుతున్నా: దినేశ్‌ కార్తీక్‌

England vs Sri Lanka: Dinesh Karthik Apologises For Sexist Comments During Commentary
ENG vs SL 2021 : 'Got It All Wrong' Dinesh Karthik Apologizes On His Comments || Oneindia Telugu

లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో వ్యాఖ్యాతగా మారిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న డీకే.. గత గురువారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా అతడికి వ్యతిరేకత ఎదురైంది. దాంతో ఆదివారం డీకే బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

వ్యాఖ్యాతగా మారిన డీకే:

వ్యాఖ్యాతగా మారిన డీకే:

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని దినేశ్‌ కార్తీక్‌ తన గొంతుని వినిపించాడు. వ్యాఖ్యానం చేయడం అదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాతగా.. మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్‌ వాతావరణ పరిస్థితులను అభిమానులకు ఇప్ప్పటికపుడు తెలియజేసి 'శభాష్' అనిపించుకున్నాడు. దాంతో ఇంగ్లండ్‌, శ్రీలంక వ‌న్డే సిరీస్ కోసం కూడా స్కై స్పోర్ట్స్‌తో కార్తీక్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు టీమ్స్ మ‌ధ్య జరిగిన రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా డీకే చేసిన కామెంట‌రీ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

 బ్యాట్లనేవి భార్యల్లాంటివి:

బ్యాట్లనేవి భార్యల్లాంటివి:

'బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేది రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. బ్యాట్స్‌మెన్‌ ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి' అని రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. కామెంటరీ బాక్సులో బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో కార్తీక్ పై విధంగా పేర్కొన్నాడు. ఇక మూడో వన్డే సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లోనే అతడు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

 క్షమాపణలు చెపుతున్నా:

క్షమాపణలు చెపుతున్నా:

'గత మ్యాచ్‌లో జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. అది అసలు నా ఉద్దేశమే కాదు. దాన్ని తప్పుగా వ్యక్తీకరించాను. ఆ విషయంలో ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా. కచ్చితంగా అలా అనాల్సింది కాదు. అలా అనడం వల్ల నా భార్య, తల్లి నుంచి కూడా ఆగ్రహానికి గురయ్యాను. మరోసారి ఇలా జరగకూడదని భావిస్తున్నా' అని దినేష్ కార్తీక్‌ పేర్కొన్నాడు. కార్తీక్ మొదటి భార్య నికితా వంజరా క్రికెటర్ మురళీ విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డీకేను మోసం చేసి.. విజయ్‌ని పెళ్లాడిందని వార్తలు కూడా ఉన్నాయి. అందుకే అలా అన్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 టీ20 ప్రపంచకప్‌ టార్గెట్:

టీ20 ప్రపంచకప్‌ టార్గెట్:

దినేశ్ కార్తీక్‌ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులు చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు.



Story first published: Monday, July 5, 2021, 10:06 [IST]
Other articles published on Jul 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+