సందకన్ వేసిన ఐదు ఓవర్లని పరిశీలించిన
మొత్తంగా సోమవారం తొలి సెషన్‌లో సందకన్ వేసిన ఐదు ఓవర్లని పరిశీలించిన ‘మ్యాచ్ ప్రసార ఛానల్' 40% అంటే, 12 బంతుల్ని అతను నోబాల్‌గా వేసినట్లుగా వెలుగులోకి తెచ్చింది. ఇందులో రెండు బంతులు అంటే.. 6% మాత్రమే అంపైర్లు గుర్తించగలిగారు. ఈ నోబాల్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

42 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్
కొలంబో వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 55 ఏళ్ల విరామం తర్వాత విదేశాల్లో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక, రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌నైట్ స్కోరు 53/4తో నాలుగో రోజు
ఓవర్‌నైట్ స్కోరు 53/4తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టు 82 పరుగుల వద్ద నైట్ సండకన్ (7) వికెట్ కోల్పోయింది. ఈ దశలో కుశాల్ మెండిస్ (86), రోషన్ సిల్వా (65) ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంక జట్టులో ఆశలు రేపారు.

184/5 వద్ద కుశాల్ ఔట్
జట్టు స్కోరు 184/5 వద్ద కుశాల్ ఔటవడంతో ఇంగ్లాండ్ విజయావకాశాలు మెరుగయ్యాయి. 226 పరుగులకే తొమ్మిదో వికెట్ కోల్పోయినప్పటికీ, చివర్లో పుష్పకుమార (42 నాటౌట్), లక్మల్ (11)లు తీవ్రంగా పోరాడారు. దీంతో శ్రీలంక స్కోరు 280 పరుగులు దాటింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు జాక్ లీచ్ (4/72), మొయిన్ అలీ (4/92) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
1963లో న్యూజిలాండ్ గడ్డపై 3-0తో సిరీస్ విజయం
మూడు టెస్టు మ్యాచ్‌ల భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరగా 1963లో న్యూజిలాండ్ గడ్డపై 3-0తో సిరీస్ విజయం సాధించిన ఇంగ్లాండ్.. ఇన్నాళ్లకు మళ్లీ విదేశాల్లో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications













