కళ్లు చెదిరే రీతిలో పట్టిన ఈ క్యాచ్ నా భూతో.. నా భవిష్యత్తు..! ఇంగ్లాండ్‌పై సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా

తబ్రైజ్ షమ్సీ ఐదు వికెట్ల హాల్ ప్రదర్శనతో ఆదివారం ఏజియాస్ బౌల్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా ఇంగ్లాండ్‌పై 90పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (70పరుగులు 50బంతుల్లో 9ఫోర్లు), రూసో (31పరుగులు 18బంతుల్లో), ఐడెన్ మార్కరమ్ (51పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు నాటౌట్), మిల్లర్ (22పరుగులు 9బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్) చెలరేగి ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లు వీరి ధాటికి తేలిపోయారు. విల్లీ ఒక్కడే 3వికెట్లు తీసి కాస్త పర్వాలేదనిపించాడు.
పూర్తిగా చేతులెత్తేసిన ఇంగ్లాండ్
ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆ జట్టు బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (27పరుగులు)మినహా మిగతా ఎవరూ కూడా 20పరుగులకు మించి చేయలేకపోయారు. తబ్రైజ్ షమ్సీ 4ఓవర్లలో 24పరుగులు మాత్రమే ఇచ్చి 5వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహరాజ్ 2, అన్రిచ్ నార్జ్ , పెహులుక్వయో , మార్క్రమ్ తలా ఓ వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ 16.4ఓవర్లలో 101పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తబ్రైజ్ షమ్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ఈ సిరీస్లో రాణించిన రీజా హెండ్రిక్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
క్రాస్ డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని..
ఇకపోతే ఈ మ్యాచ్‌లో హైలెట్ విషయమేంటంటే.. దక్షిణాఫ్రికా యువ ప్లేయర్ త్రిస్టన్ స్టబ్స్ పట్టిన అద్భుత క్యాచ్. 10ఓవర్లో మార్కరమ్ బౌలింగ్లో మొయిన్ అలీ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ చివరి బంతికి మొయిన్ అలీ స్ట్రెయిట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచి మిడ్ ఆఫ్ దిశగా వెళ్లింది. ఇక మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న త్రిస్టన్ స్టబ్స్ బంతిని అందుకోవడం దాదాపు అసాధ్యమైన ప్లేస్‌లో ఉన్నాడు. కానీ అతను గాల్లో అద్వితీయంగా క్రాస్ డైవ్ చేసి.. లెఫ్టాండ్‌తో ఒంటి చేత్తో గాల్లోని క్యాచ్ అందుకున్నాడు. అసలు నమ్మశక్యం కానీ రీతిలో అతను క్యాచ్ అందుకోవడంతో మొయిన్ అలీతో సహా, ఇంగ్లాండ్ ప్లేయర్లు స్టన్ అయిపోయారు. ఇక దక్షిణాఫ్రికా టీంమేట్స్ అతన్ని సంబరాల్లో ముంచెత్తారు. ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తుది జట్లు
ఇంగ్లాండ్ : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (c & wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ (c), ట్రిస్టన్ స్టబ్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications