Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng vs SA 1st Test: బ్యాజ్‌బాలా తొక్కా..! ఇంగ్లాండ్ గాలి తీసిన దక్షిణాఫ్రికా, ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో గెలుపు

England vs Southafrica : Southafrica Beat England By Innings plus 12runs

దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మాట నిలబెట్టుకున్నాడు. బాజ్‌బాల్ అంతు చూస్తామని పేర్కొన్న ఎల్గర్ అన్నంత పని చేశాడు. తన సారథ్యంలోని జట్టు తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఇటీవల న్యూజిలాండ్‌ను, భారత్‌‌ను వరుసగా ఓడించిన ఇంగ్లాండ్.. తామో కొత్త పంథాను టెస్టుల్లో చూపిస్తున్నామని, ఫియర్ లెస్ క్రికెట్ అంటూ పేట్రేగిన ఆ జట్టు విజయగర్వాన్ని సౌతాఫ్రికా అణగదొక్కింది. ఐకానిక్ లార్డ్స్‌ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్, 12పరుగుల తేడాతో ఓడించింది.

దక్షిణాఫ్రికా భీకరమైన పేస్ అటాక్.. బాజ్‌బాల్ సేన పుంగీ బజాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో 161పరుగుల ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా 149పరుగులకే ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చి సగర్వమైన విజయాన్ని సాధించింది.

బాగా మోగారు.. దక్షిణాఫ్రికా ఖంగు తినిపించింది

బాగా మోగారు.. దక్షిణాఫ్రికా ఖంగు తినిపించింది

ఇంగ్లాండ్ జట్టు పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ సేనకు ఇది మొదటి ఓటమి. ఇంగ్లాండ్ వరుసగా 4 టెస్ట్‌లను గెలిచి హవా చూపించడంతో.. మాకు తిరుగులేదన్నట్లు మోగారు. అయితే 'బాజ్‌బాల్' పంథాతో ప్రోటీస్‌తో తొలి టెస్టులో బరిలోకి దిగగా.. దక్షిణాఫ్రికా టీం ఆ జట్టును ఖంగుతినిపించింది.

3మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఇకపోతే డీన్ ఎల్గర్ సారథ్యంలో దక్షిణాఫ్రికా టీం 2022లో ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. స్వదేశంలో భారత్‌ను 2-1తో ఓడించిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో 1-1తో సిరీస్‌ను డ్రా చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది.

రబాడ అదుర్స్.. నార్జ్ బెదుర్స్

రబాడ అదుర్స్.. నార్జ్ బెదుర్స్

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మెరుపుదాడికి తెగబడ్డాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 5వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పరాభవానికి పాదులు వేశాడు. 5వికెట్ల హాల్ సాధించి లార్డ్స్ హానర్‌బోర్డ్‌లో తన పేరు నిలుపుకున్న రబాడ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

అన్రిచ్ నోర్ట్జే 6వికెట్లతో పేస్‌లో రాజీపడలేదు. జానీ బెయిర్‌స్టోను నార్జ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అవుట్ చేసి ఇంగ్లాండ్‌‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు వీరిద్దరికీ తోడుగా మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి కూడా సపోర్టివ్ బౌలింగ్ వేశారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఆశ్చర్యకరంగా రాణించాడు.

సమిష్టిగా సత్తా చాటిన దక్షిణాఫ్రికా

సమిష్టిగా సత్తా చాటిన దక్షిణాఫ్రికా

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 165పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓలీ పోప్ (73) మినహా మిగతావాళ్లెవరూ రాణించలేదు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎల్గర్ (47), సరెల్ ఎర్వీ (73) 85 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్కో జాన్సేన్ (48), మహరాజ్ (41), నార్జ్ (28) కూడా విలువైన పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 326పరుగుల స్కోరు చేసి 161పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్ తలా 3వికెట్లు తీసి సత్తాచాటారు.

రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో అలెక్స్ లీస్ (35), స్టువర్ట్ బ్రాడ్ (35) మినహా మిగతావాళ్లు తుస్సుమనిపించారు. దీంతో 149పరుగులకే ఆ జట్టు చాప చుట్టేసింది. తద్వారా ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.

Story first published: Friday, August 19, 2022, 22:12 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+