
నేటి నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు ప్రారంభమైంది. ఈసీబీ ఒక్కరోజు ముందుగానే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11ను ప్రకటించగా.. దక్షిణాఫ్రికా మాత్రం టాస్ టైంలో తమ టీంను ప్రకటించింది. ఇక ఆ జట్టు ఆల్రౌండర్ మార్కో జాన్సేన్‌ను తప్పించారు. జాన్సేన్ పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి టెస్టులో అతను బౌలింగ్, బ్యాటింగ్ పరంగా విలువైన సహకారం అందించాడు. ఇక అతని స్థానంలో బౌలర్ సైమన్ హర్మర్‌ను తుది జట్టులోకి డీన్ ఎల్గర్ తీసుకున్నాడు. బౌలింగ్ విషయంలో అదనపు బౌన్స్ కీలకం కానుండడంతో జాన్సేన్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ సైతం మ్యాటీ పాట్స్ స్థానంలో అదనపు బౌన్స్ కోసం ఓలి రాబిన్సన్‌ను రెండో టెస్ట్ కోసం తీసుకుంది. ఇక ఇరు జట్లు తలా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నాయి. ఇకపోతే తొలి టెస్టులో ఇన్నింగ్స్, 12 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1తేడాతో వెనకబడింది. ఈ మ్యాచ్ గనుక ఓడిపోతే ఆ జట్టు ఇంట్రడ్యూస్ చేసిన 'బాజ్‌బాల్' మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం స్టోక్స్, ఎల్గర్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన డీన్ ఎల్గర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇది ఇంగ్లాండ్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే ఇంగ్లాండ్ ఇటీవల న్యూజిలాండ్, ఇండియా మీద గెలిచిన అన్ని మ్యాచ్‌ల్లో ఛేజింగే చేసింది. అందువల్ల ఈ నిర్ణయం ఇంగ్లాండ్‌కు కాస్త కలిసొచ్చేలా ఉంది. అయితే పిచ్ పరిస్థితి మేరకు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడమే సరైన విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక రెండో టెస్టులో ఏ జట్టు సత్తా చాటుతుందో చూడాలి.
రెండో టెస్ట్ కోసం ఇరు జట్లు
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 : డీన్ ఎల్గర్ (కెప్టెన్), సారెల్ ఎర్వీ, కీగన్ పీటర్‌సన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), సైమన్ హర్మర్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నార్జే, లుంగి ఎన్‌గిడి