Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs Eng 2nd Test Playing 11 : బాజ్‌బాల్ పవరేంటో చూపించాలనుకుంటున్న ఇంగ్లాండ్.. రెండో టెస్ట్ టీం ఇదే..!

England vs Southafrica 2nd Test : Robinson In, Matty Out.. England Announced Playing 11

దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంగ్లాండ్ టీంను ప్రకటించింది. దక్షిణాఫ్రికా టాస్ టైంలో తమ టీంను ప్రకటించనుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 12 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1తేడాతో వెనకబడింది. ఇక తొలి టెస్ట్‌లోనే ఆతిథ్య జట్టుకు కోలుకోలేని దెబ్బ రుచి చూపించిన ప్రోటీస్ జట్టు మరింత ఉత్సాహంతో రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. రెండో టెస్టులో లెక్క సరిచేసేలా భారీ విజయం సాధించి.. తమ బాజ్ బాల్ పవరేంటో చూపించాలని ఇంగ్లాండ్ చూస్తుంది.

రాబిన్సన్ పునరాగమనం..

ఇకపోతే ఇంగ్లాండ్ ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఫాస్ట్ బౌలర్ ఆలీ రాబిన్సన్ చోటు సంపాదించాడు. ఇక యువ పేసర్ మ్యాటీ పాట్స్‌ను తప్పించి రాబిన్సన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. జనవరిలో హోబర్ట్‌లో జరిగిన అయిదో యాషెస్ టెస్టు తర్వాత రాబిన్సన్ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెన్ను సమస్యల కారణంగా ఈ 28ఏళ్ల సీమర్ గత 8 నెలలుగా జట్టుకు దూరమయ్యాడు. ఈ టైంలో కరోనా, కొన్ని డెంటల్ సమస్యలను కూడా అతను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతను తన సమస్యలన్నింటినీ అధిగమించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇకపోతే జులై చివర్లో కౌంటీల్లో సస్సెక్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన రాబిన్సన్ నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 110పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు.

అదనపు బౌన్స్ కోసం అతన్ని ఎంచుకున్నాం

అతను కన్సిస్టెన్సీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఇంగ్లాండ్ రెండో టెస్ట్ కోసం తుది జట్టులోకి తీసుకుంది. బుధవారం మాంచెస్టర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. రాబిన్సన్‌కు అదనపు బౌన్స్‌ వేసే సామర్థ్యం ఉందని, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని ట్రాక్ అతనికి సరిపోతుందని చెప్పాడు. తాము రాబిన్సన్ నుంచి ఆశిస్తుంది అదనపు బౌన్స్ అని పేర్కొన్నాడు. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

రెండో టెస్ట్ కోసం ఇరు జట్లు

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 అంచనా : డీన్ ఎల్గర్ (కెప్టెన్), సారెల్ ఎర్వీ, కీగన్ పీటర్‌సన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్జే, లుంగి ఎన్‌గిడి

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం ఇలా :

ఇక తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 165పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓలీ పోప్ (73) మినహా మిగతావాళ్లెవరూ రాణించలేదు. రబాడా 5, నార్జ్ 3వికెట్లు తీశారు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఎల్గర్ (47), సరెల్ ఎర్వీ (73) 85 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్కో జాన్సేన్ (48), మహరాజ్ (41), నార్జ్ (28) కూడా విలువైన పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 326పరుగుల స్కోరు చేసి 161పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్ తలా 3వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో అలెక్స్ లీస్ (35), స్టువర్ట్ బ్రాడ్ (35) మినహా మిగతావాళ్లు తుస్సుమనిపించారు. దీంతో 149పరుగులకే ఆ జట్టు చాప చుట్టేసింది. తద్వారా ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.

Story first published: Thursday, August 25, 2022, 11:41 [IST]
Other articles published on Aug 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+