SA vs Eng 2nd Test : రెండో రోజు ఇంగ్లాండ్ పట్టు నిలుపుకుంటుందా..? సౌతాఫ్రికాకు పట్టుబడుతుందా?

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టులో బ్రిటిష్ జట్టు తొలి రోజు పట్టు బిగించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 12 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1తేడాతో వెనకబడిన ఇంగ్లాండ్ పుంజుకునే ప్రయత్నం ధాటిగానే చేస్తుంది. ఈ మ్యాచ్ గనుక ఓడిపోతే ఆ జట్టు ఇంట్రడ్యూస్ చేసిన 'బాజ్‌బాల్' అనే కొత్త పంథా ఉత్తదే అవుతుంది.. ఇక తమ ఫియర్ లెస్ క్రికెట్ రిజల్ట్స్ ఒక్కోసారి మాత్రమే ఫెయిల్ అవుతుందని.. మళ్లీ పుంజుకునే వీలుందని చెప్పడానికి ఇంగ్లాండ్‌కు మరో మంచి అవకాశం దక్కింది. తొలి రోజు ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది.

అండర్సన్, బ్రాడ్ చెలరేగడంతో..
ఈ మ్యాచ్ టాస్ గెలిచిన డీన్ ఎల్గర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇది ఇంగ్లాండ్‌కు ఊరటనిచ్చింది. ఎందుకంటే ఆ జట్టు ఛేజింగ్లో చాలా బాగా ఆడుతుందనే విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే తొలి రోజు బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలా మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. కెప్టెన్ స్టోక్స్ 2, జాక్ లీచ్, రాబిన్సన్ తలా ఓ వికెట్ తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. దీంతో దక్షిణాఫ్రికా 151పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో రబాడా (36) అత్యధిక స్కోరు చేయడం గమనార్హం.

మరోసారి కుదురుకున్న జానీ బెయిర్‌స్టో
ఇక అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ పట్టుదలగా ఆడుతుంది. అయితే ఆ జట్టు అలెక్స్ లీస్ (4), పోప్ (23), జో రూట్ (9) విఫలమైనా.. జాక్ క్రాలీ (17పరుగులు 77బంతుల్లో నాటౌట్), జానీ బెయిర్ స్టో (38పరుగులు 45బంతుల్లో 6ఫోర్లు నాటౌట్) కుదురుకుని తొలి రోజు ముగిసేవరకు క్రీజులో నిలబడి 68పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆ జట్టు 3వికెట్లు కోల్పోయి 111పరుగులు చేయగలిగింది. ఆధిక్యం సాధించడానికి మరో 40పరుగుల వెనకబడి ఉంది. రెండో రోజు పూర్తిగా ఆ జట్టు బ్యాటింగ్ చేయగలిగితే ఇంగ్లాండ్ దుర్భేద్యమైన స్థితిలోకి వచ్చి గెలవడానికి అవకాశాలు రెట్టింపవుతాయి. ఇక తొలిరోజు పట్టుబిగించిన ఇంగ్లాండ్.. తమ పట్టు నిలుపుకుంటుందో.. సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు పట్టు విడుస్తుందో చూడాలి. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, నార్జ్, ఎంగిడి తలా ఓ వికెట్ తీశారు.

ఇరు జట్లు
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 : డీన్ ఎల్గర్ (కెప్టెన్), సారెల్ ఎర్వీ, కీగన్ పీటర్‌సన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), సైమన్ హర్మర్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నార్జే, లుంగి ఎన్‌గిడి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications