Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs Eng 1st Test Playing 11 : బాజ్‌బాల్ అంతుచూడ్డానికి ప్రోటీస్ సై..! ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తుది టీంలు!

England vs Southafrica 1st Test : Proteas Won The Toss And Decided to Bowl

లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ టీం.. తమ తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్‌)ను నిన్ననే ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గత నెల భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టే దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ఆడనుంది. కేవలం ఒక్క మార్పు జరిగింది. కీపర్ సామ్ బిల్లింగ్స్‌కు బదులు మరో కీపర్ బెన్ ఫోక్స్‌ తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. ఇక సౌతాఫ్రికా టాస్ సందర్భంగా తమ తుది జట్టును వెల్లడించింది. డీన్ ఎల్గర్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు మంచి ప్లేయర్లతో ఇంగ్లాండ్‌తో తలపడడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి టెస్ట్ టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ ప్రదర్శనతో టెస్టుల్లో నయా ట్రెండ్‌ను కొనసాగిస్తుందో లేక దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి చేతులెత్తేస్తుందో చూడాలి.

బాజ్‌బాల్ సంగతేంటో తేలుస్తామని..

బాజ్‌బాల్ సంగతేంటో తేలుస్తామని..

కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంగ్లాండ్ ఓటమి ఎరుగకుండా టెస్టుల్లో హవా చూపిస్తుంది. వీరిద్దరి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఇంగ్లాండ్ ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. పైగా వీరి ఆటకు బాజ్‌బాల్ అనే ఓ పేరొచ్చింది. ఫియర్ లెస్ క్రికెట్ అని, టెస్టుల్లోనూ ఎటాకింగ్ గేమ్ అని రకరకాల పేర్లు ఇంగ్లాండ్ టెస్ట్ ఆటకు వచ్చాయి. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మాత్రం ఇంగ్లాండ్ ఆటను తాము గమనిస్తున్నామని.. తమ స్టార్ బౌలర్లకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ బ్యాటర్లు బాజ్‌బాల్ తరహాలో ఎలా ఆడతారో చూస్తానంటూ సవాల్ కూడా చేశాడు. ఈ బాజ్‌బాల్ అంతు తేల్చుతామన్నట్లు డీన్ ఎల్గర్ చెప్పకనే చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్ టఫ్ అండ్ టఫ్ రావడం ఖాయంగా కన్పిస్తుంది.

క్రికెట్ మక్కాలో ఇంగ్లాండ్‌దే పైచేయి

క్రికెట్ మక్కాలో ఇంగ్లాండ్‌దే పైచేయి

ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ మక్కాగా పేర్కొనే లార్డ్స్‌లో 16 టెస్ట్‌లు ఆడగా ఇంగ్లాండ్ ఏడింటిలో గెలిచి దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించింది. దక్షిణాఫ్రికా 5గెలవగా నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా జూలై 2017లో లార్డ్స్‌లో తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లాండ్ 211పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పుడు డీన్ ఎల్గర్ సారథ్యంలోనే దక్షిణాఫ్రికా ఓటమి పాలయింది. ఇప్పుడు ఆ ఓటమికి లెక్క తేల్చుకోవాలని డీన్ ఎల్గర్ సేన తహతహలాడుతోంది. కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్, లుంగి ఎంగిడి లాంటి టఫ్ బౌలర్లను ఇంగ్లాండ్‌పైకి ఎల్గర్ ఉసిగొల్పనున్నాడు.

తుది జట్లు

తుది జట్లు

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI) : డీన్ ఎల్గర్ (కెప్టెన్), సారెల్ ఎర్వీ, కీగన్ పీటర్‌సన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్జే, లుంగి ఎన్‌గిడి

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, మ్యాటీ పాట్స్, జేమ్స్ ఆండర్సన్


Story first published: Wednesday, August 17, 2022, 15:50 [IST]
Other articles published on Aug 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+