Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టుల్లో చెత్త రికార్డు: నోబాల్స్‌లో 13 వికెట్లు పడగొట్టిన పేసర్

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ టెస్టుల్లో ఎవరూ కోరుకోని ఓ చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సఫారీలపై ఇంగ్లాండ్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బెన్ స్టోక్స్‌ని మోర్నీ మోర్కెల్ 44 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అయితే ఇది నోబాల్ కావడంతో బెన్ స్టోక్స్ బతికిపోయాడు. మొత్తం 13 వికెట్లను గిరాటేసిన మోర్కెల్ అవన్నీ నోబాల్స్ కావడంతో ఈ చెత్త రికార్డు అతని సొంతమైంది.

England v South Africa: Morne Morkel’s unwanted Test record

లార్డ్స్‌ వేదికగా జులై 6 నుంచి 10 వరకు ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ తొలి టెస్టులో బెన్‌స్టోక్స్ వికెట్ తీయడంతో మోర్నీ మోర్కెల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో నోబాల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మోర్కెల్ రికార్డు సాధించాడు.

సాధారణంగా టెస్టుల్లో నో బాల్స్ ద్వారా తాను తీసిన వికెట్లను ఏ బౌలర్ కూడా జేజార్చుకోవడం జరగదు. ఈ చెత్త రికార్డుపై మ్యాచ్ అనంతరం మోర్కెల్‌ని మీడియా ప్రశ్నించగా "ఇది తన జీవితంలో మొదటి నోబాల్ కాదని బదులిచ్చాడు. అలాగే ఇక్కడితోనే తన జీవితం ముగిసిపోదు" అని పేర్కొన్నాడు.

ఇది కూడా ఆటలో ఓ భాగమేనని పేర్కొన్నాడు. మోర్నీ మోర్కెల్ దక్షిణాఫ్రికా తరపున ఇప్పటి వరకు 75 టెస్ట్‌లు ఆడి 260 వికెట్లు తీశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+