England vs Pakistan: సిరీస్‌పై ఇంగ్లండ్ గురి.. స్టోక్స్ లేకుండా బరిలోకి.. ఒత్తిడిలో పాక్!

సౌతాంప్టన్: బయో బబుల్ వాతావారణంలో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. మూడున్నర రోజులు అదరగొట్టినా.. ప్రత్యర్థి ముందు మంచి టార్గెట్టే ఉంచినా.. బౌలింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో విజయాన్ని చేజార్చుకున్న పాకిస్థాన్ చావో రేవో పోరుకు సిద్దమైంది. ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌లో నిలాలని చూస్తోంది. ఇక అద్భుత ఆటతో తొలి టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్‌పై కన్నేసింది.

ఇక్కడి రోస్ బౌల్ స్టేడియంలో గురువారం మొదలయ్యే రెండో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గైర్హాజరీ లోటే అయినా ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. తొలి టెస్ట్ ఊపును సౌతాంప్టన్‌లోనూ కొనసాగించి ఇక్కడే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఒత్తిడంతా పాక్‌పైనే ఉండనుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జోరు సాగుతుందా..? పాక్ సిరీస్‌లో నిలుస్తాందా..? చూడాలి.!!

స్టోక్స్ లేకున్నా సై..

స్టోక్స్ లేకున్నా సై..

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సిరీస్‌లో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్‌లో అతను బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ స్టోక్స్ లేకపోవడం ఆతిథ్య జట్టుకు దెబ్బే. అతని స్థానంలో ససెక్స్ పేసర్ ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులో చేర్చారు.

కానీ అతను తుది జట్టులో ఉండే అవకాశం కనిపించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌ల బౌలర్ల ప్రతిభ, బట్లర్, క్రిస్ వోక్స అసాధారణ పోరాటంతో మాంచెస్టర్‌లో విజయం సాధించినప్పటికీ బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ మరింత మెరుగవ్వాలి.

బ్యాటింగ్ మెరుగవ్వాలి..

బ్యాటింగ్ మెరుగవ్వాలి..

ముఖ్యంగా ఓపెనర్లు బర్న్స్, సిబ్లే శుభారంభం ఇవ్వాలి. కొత్త బంతితో పాక్ పేస్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొవాలి. రూట్ తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ మెరుగవ్వాలి. మిడిలార్డర్‌లో పోప్, బట్లర్, వోక్స్ ఫామ్‌లో ఉండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. స్టోక్స్ ప్లేస్‌లో వచ్చే జాక్ క్రాలీ కూడా ఓ చేయి వేస్తే ఇంగ్లండ్‌కు తిరుగుండదు.

బౌలింగ్‌లో హోమ్‌ టీమ్‌కు పెద్దగా సమస్యలు లేవు. స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్‌తో పాటు క్రిస్ వోక్స్ జోరు మీదున్నారు. మాంచెస్టర్‌లో విఫలమైన అండర్సన్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

పాక్ రాణించేనా..?

పాక్ రాణించేనా..?

ఫస్ట్ టెస్ట్‌లో మూడు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించినా ఎదురైన ఓటమిని పాక్ జీర్ణించుకోలేకపోతుంది. కెప్టెన్‌గా అజర్ అలీ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి అతడి తప్పించాలన్న డిమాండ్లు కూడా మొదలయ్యాయి. సౌతాంప్టన్‌లో గెలిచి వాటికి సమాధానం చెప్పాలని అజర్ భావిస్తున్నాడు. ఈ విమర్శలను పక్కన పెట్టి తప్పిదాలు చేయకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బౌలర్లు క్రిస్‌వోక్స్ కు తగినన్ని షార్ట్ బాల్స్ వేయకుండా మూల్యం చెల్లించుకున్నారు.

సౌతాంప్టన్‌లో గ్రీన్ ట్రాక్ . ఇరు జట్ల పేసర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో ఎక్స్‌ట్రా పేసర్‌గా సోహైల్ ఖాన్‌ను పాక్ బరిలోకి దింపొచ్చు. నసీమ్, షాహిన్, అబ్బాస్ కూడా జోరు మీదున్నారు. బ్యాటింగ్‌లో కూడా పాక్ మెరుగవ్వాలి. కెప్టెన్ అజర్‌తో పాటు భారీ అంచనాలున్న బాబర్ ఆజమ్, అబిద్ అలీ రాణిస్తేనే పాక్ సిరీస్‌లో నిలవగలదు.

జట్లు(అంచనా)..

జట్లు(అంచనా)..

ఇంగ్లండ్: రోరి బర్న్స్, సిబ్లే, జోరూట్(కెప్టెన్), క్రాలీ, ఒలి పోప్, జోస్ బట్లర్(కీపర్), క్రిస్ వోక్స, డామ్ బెస్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్

పాకిస్థాన్: షాన్ మసూద్, అబిద్ అలీ, అజర్ అలీ(కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫవాద్ ఆలమ్, మహ్మద్ రిజ్వాన్(కీపర్), సోహైల్ ఖాన్, యాసిర్ షా, మొహమ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా

నోట్: మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. ఇక మ్యాచ్‌ ఐదు రోజులూ వర్షంపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది.

ఆ క్షణమే సర్ఫరాజ్ అహ్మద్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సింది: రమీజ్ రాజా

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 13, 2020, 9:03 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X