Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs Pakistan: క్రికెట్‌ ఎంతో మారిపోయింది.. విజయాలు సాధించాలంటే అదే పనిగా పెట్టుకోవాలి: అఫ్రిది

England vs Pakistan: Shahid Afridi feels Now a days attacking bating is the best way to succeed
Fans roast Babar Azam's Pakistan after humiliating loss to England | Oneindia Telugu

రాచీ: కొద్దికాలంగా క్రికెట్‌ ఎంతో మారిపోయిందని, ఇప్పుడు విజయాలు సాధించాలంటే దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది పేర్కొన్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లకు అండగా ఉండాలని అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కారణంగా మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కరోనా కేసులు నమోదవంతో ప్రధాన ఆటగాళ్లంతా క్వారంటైన్‌లోకి వెళ్లడంతో.. ఇంగ్లండ్ బీ టీమ్‌తో బరిలోకి దిగింది. ఏకంగా 9 మంది కొత్త ఆటగాళ్లు ఆ జట్టులోకి వచ్చారు. అయినా పటిష్ట పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వకుండానే ఓడిపోయింది.

ఆటగాళ్లకు అండగా ఉండాలి:

ఆటగాళ్లకు అండగా ఉండాలి:

పాకిస్తాన్ వరుస పరాజయాలు ఆ జట్టు అభిమానులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే అఫ్రిది ఓ వీడియోలో మాట్లాడుతూ పాక్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. 'ప్రస్తుత పాకిస్థాన్‌ ఆటగాళ్లు నైపుణ్యం, సామర్థ్యం పరంగా అత్యుత్తమ ప్లేయర్స్. నిజం చెప్పాలంటే అందరూ నిలకడగా ఆడుతున్నారు. కొంతమంది అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీళ్లు మంచి ఆటగాళ్లు. అయితే వారిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. వారిలో విజయకాంక్ష నెలకొల్పుతూ ప్రోత్సహించాలి. ఇలాంటి కష్టసమయాల్లో అండగా ఉండాలి. మైదానంలో వాళ్లు పోరాడేంతవరకు నేను ఓటములను అంగీకరిస్తాను. కొద్దికాలంగా క్రికెట్‌ ఎంతో మారిపోయింది. ఇప్పుడు విజయాలు సాధించాలంటే దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి. అంతకుమించిన దారి లేదు' అని అన్నాడు.

యూఏఈలో మంచి రికార్డు ఉంది:

యూఏఈలో మంచి రికార్డు ఉంది:

ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌పై స్పందించిన మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది.. యూఏఈలో పాకిస్థాన్‌ జట్టుకు ఘన చరిత్ర ఉందని పేర్కొన్నాడు. 'యూఏఈలో మా జట్టుకు మంచి రికార్డు ఉంది. గతంలో పలు మేటి జట్లను కూడా అక్కడ ఓడించాం. అదే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో మన జట్టుకు కలిసివస్తుంది. అక్కడి పిచ్‌లపై స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. యూఏఈలో మేం చాలా మ్యాచులు ఆడాం. అక్కడి పరిస్థితులపై మా ఆటగాళ్లకు మంచి అవగాహన ఉంది. నిలకడగా ఆడితే చాలు' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

 3-0తో సిరీస్ కైవసం:

3-0తో సిరీస్ కైవసం:

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్ 9 వికెట్లకు 331 భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (158; 139 బంతుల్లో 14x4, 4x4) భారీ శతకం సాధించగా.. రిజ్వాన్‌ (74; 58 బంతుల్లో 8x4) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్ జట్టులో జేమ్స్‌ విన్స్‌ (102; 95 బంతుల్లో 11x4) సెంచరీ చేయగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లెవిస్‌ గ్రెగోరీ (77; 69 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరకు ఇంగ్లీష్ జట్టు 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

Story first published: Thursday, July 15, 2021, 15:19 [IST]
Other articles published on Jul 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+