'పాక్‌తో మ్యాచే.. చివరి టెస్టు అవుతుందేమోనని భయపడ్డా'

మాంచెస్టర్‌: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఎలా ఉన్నాడో అని భయం ఓ వైపు.. వరుసగా విఫలమవుతుండటంతో జట్టులో స్థానం పోతుందేమోనన్న ఒత్తిడి మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లండ్ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ పాకిస్తాన్‌తో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు ఆడాడు. అయితే పాకిస్తాన్‌ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యంను ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో బట్లర్ ‌(75) కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన బట్లర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో హాఫ్‌ సెంచరీ సాధించి మెరిశాడు.

ఒంటరి రాత్రుళ్లు గడిపా

ఒంటరి రాత్రుళ్లు గడిపా

పాకిస్థాన్‌తో రెండో ఇన్నింగ్స్‌కు ముందు వరకూ జోస్‌ బట్లర్‌ గత 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌గా మూడు అవకాశాలను వృథా చేశాడు. దేంతో పాక్‌తో మ్యాచే తనకు చివరి టెస్టు అవుతుందేమోనన్న భయంతో మైదానంలో అడుగుపెట్టానని బట్లర్‌ తెలిపాడు. 'టెస్టుల్లో నా ప్రదర్శన గురించి ఆలోచిస్తూ కొన్ని ఒంటరి రాత్రుళ్లు గడిపా. పాక్‌తో మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోతే అదే నా చివరి టెస్టు అవుతుందనని భయపడ్డా. కీపింగ్‌ సరిగా చేయకపోవడంతో బ్యాటింగ్‌లోనైనా వీలైనన్ని పరుగులు సాధించాలనుకున్నా. అలా చేసినందుకు ఆనందంగా ఉంది' అని బట్లర్‌ తెలిపాడు.

కీపింగ్‌ బాగా చేయలేదని తెలుసు

కీపింగ్‌ బాగా చేయలేదని తెలుసు

'నేను కొన్ని చాన్స్‌లను మిస్‌ చేయకుండా ఉంటే.. ఇంకా రెండు గంటల ముందుగానే గెలిచే వాళ్లం. ఏది ఏమైనా గెలుపులో నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్వంగా ఉంది. ఛేదనను వన్డేలాగా భావించి ఆడమని కెప్టెన్ జో రూట్‌ చెప్పాడు. అలానే ఆడాను. ఇక నేను కీపింగ్‌ బాగా చేయలేదని తెలుసు. పలు అవకాశాలను నేలపాలు చేశాను. ఇలా అవకాశాల్ని వదిలేస్తే ఎన్ని పరుగులు చేసినా లాభం ఉండదు. ఒకవేళ నేను పరుగులు కూడా చేయకపోయి ఉంటే మీరు లేనిపోని వార్తలు రాసేవారేమో. ఇదే నా చివరి గేమ్‌ అని కూడా రాసేవారు. కానీ ఆ అవకాశం మీకు ఇవ్వలేదు' అని జోస్ బట్లర్‌ పేర్కొన్నాడు.

భయం పట్టుకుందా?:

భయం పట్టుకుందా?:

అయితే జోస్ బట్లర్‌ ఉన్నట్టుండి చివరి గేమ్‌ అనే ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు బట్లర్‌కు భయం పట్టుకుందా అని ఓ వర్గం అంటోంది. బట్లర్‌కు పోటీ ఎక్కువగా ఉందనే విషయం మీడియాతో సీరియస్‌గా మాట్లాడిన అతని మాటలను బట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టులో జోస్‌ బట్లర్‌ కాకుండా.. రోరీ బర్న్స్‌, ఓలీ పోప్‌ వంటి యువ కీపర్లు ఉన్నారు. బర్న్స్‌ ఆడిన 19 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఇక ఓలీ పోప్‌ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1 సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మరి బట్లర్‌ ఇప్పటివరకూ 45 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కేవలం ఒక్క సెంచరీ, 17 హాఫ్‌ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు.

పరిమిత ఓవర్ల ఆటగాడిగానే

పరిమిత ఓవర్ల ఆటగాడిగానే

మొత్తంగా చూస్తే జోస్ బట్లర్‌ను ఇంగ్లండ్‌ జట్టు ఎక్కువగా పరిమిత ఓవర్ల ఆటగాడిగానే చూస్తోంది. కానీ బ్యాటింగ్‌లో నిలకడ ఉండటంతో టెస్టుల్లో కూడా బట్లర్‌ చోటు సంపాదించుకుంటూ వస్తున్నాడు. వచ్చే నెలతో 30 ఏళ్లు పూర్తిచేసుకోబోతున్న బట్లర్‌.. తనకు ఇంకా టెస్టు క్రికెట్‌ ఆడాలనే విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో బట్లర్‌ ఇప్పటివరకు 45 టెస్టుల్లో, 142 వన్డేల్లో, 69 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఎంఎస్ ధోనీ గురించి ఆ విషయం చాలా మందికి తెలియదు: అంపైర్‌ టౌఫెల్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 10, 2020, 14:14 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X