Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మ్యాచ్‌కి ముందు అక్తర్-పీటర్సన్ మాటల యుద్ధం

ICC World Cup 2019 : Pietersen Reverse Sweeps Akhtar's Inspirational World Cup Message
England vs Pakistan Clash: Kevin Pietersen Brutally Trolls Shoaib Akhtar With Epic Reply To Motivational Tweet

హైదరాబాద్: వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా సోమవారం నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా.... వెస్టిండిస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఈ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన ట్విట్టర్‌లో పాక్ ఆటగాళ్లను ఉత్సాహాపరిచేలా ఓ ట్వీట్‌ చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ట్వీట్‌లో కెవిన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో ఉన్న తన పాత ఫొటోను జత చేశాడు. "మీ జట్టుకు మీరు ప్రాతినిథ్యం వహించాలంటే రక్తం, చెమట, దూకుడు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండాలి. ఇవే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాయి. వెళ్లండి గట్టిపోటీనివ్వండి" అని కామెంట్ పెట్టాడు.

దీంతో షోయబ్ అక్తర్ ట్వీట్‌కు కెవిన్ పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు. "నేను నీ ట్వీట్‌తో వాదించదల్చుకోలేదు బడ్డీ. నేనే నీ బౌలింగ్‌లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలానే సంబరాలు చేసుకుంటావు కదా! గొప్ప పిచ్చి" అని అక్తర్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

దీనికి బదులుగా అక్తర్ "నా సహచరుడా నీవు నా బౌలింగ్‌లో ఔటైనప్పుడు నేను చేసే కోడి డ్యాన్స్‌ నీకు ఇష్టం కదా" అని ట్వీట్‌ చేశాడు. ఇందుకు ఇష్టమే బడ్డీ అని పీటర్సన్‌ ట్వీట్ చేయగా... "నీ ఇష్టాన్ని నీ శైలిలో వ్యక్తం చేయి" అని అక్తర్ అన్నాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Story first published: Monday, June 3, 2019, 14:47 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+