For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs PAK: మరో సిరీస్‌పై ఇంగ్లండ్‌ కన్ను.. నేటి నుంచి పాక్‌తో చివరి టెస్టు!!

England vs Pakistan 3rd Test starts from today, Southampton Weather Forecast and Pitch Report

సౌతాంప్టన్‌: వెస్టిండీస్‌పై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌.. వరుసగా రెండో సిరీస్‌ పట్టేయాలనే ఉత్సాహంతో ఉంది. మరోవైపు సిరీస్‌ను సమంగా ముగించాలని పర్యాటక పాకిస్థాన్‌ పట్టుదలతో కనిపిస్తోంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య ఆఖరిదైన మూడో మ్యాచ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం కానుంది.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ జో రూట్ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్ అండర్సన్‌తో బౌలింగ్‌ మెరుగ్గానే ఉంది. ఇక పాక్‌ పేసర్లు షహీన్‌ అఫ్రీది, అబ్బాస్‌ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. మసూద్‌, బాబర్‌, రిజ్వాన్‌తో పాక్‌ బ్యాటింగ్‌ కూడా బలంగానే కనిపిస్తోంది.

1
46764

పాకిస్థాన్‌ 2010 నుంచి ఇంగ్లండ్‌కు సిరీస్‌ కోల్పోలేదు. విజయం కోసం రెండు జట్లు నువ్వానేనా అన్నట్టుగా ఢీకొనేందుకు సిద్ధం కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో గెలుపు దారి నుంచి ఓటమి ఒడి చేరిన పాకిస్తాన్‌.. ఈ మ్యాచ్‌లోనైనా సమిష్టిగా రాణించాలని చూస్తోంది. కానీ వరుణుడు ఏం చేస్తాడో చూడాలి. రెండో టెస్టు వేదిక సౌతాంప్టన్‌లోనే జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించొచ్ఛు. వర్షం కారణంగా రెండో టెస్టులో 134 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన విషయం తెలిసిందే.

రెండో టెస్ట్‌లో వెలుతురు లేమి కారణంగా ఆటకు ఎక్కువ ఆటంకం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓ అరగంట ముందుగానే మ్యాచ్‌ను ఆరంభించాలని నిర్ణయించారు. అంటే మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకే మొదలు కానుంది. ఇక టాస్ 2:30కే పడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానానికి ఎగబాకుతుంది. మధ్యాహ్నం 3 గం. నుంచి సోనీ సిక్స్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.

Story first published: Friday, August 21, 2020, 8:52 [IST]
Other articles published on Aug 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+