Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Vs Newzealand 1st Test : టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, వణికిస్తున్న ఆండర్సన్

England Vs Newzealand 1st Test : New Zealand have won the toss and Elected bat first, Anderson On fire

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. మిగతా రెండు టెస్టులు నాటింగ్‌హామ్, లీడ్స్‌ వేదికగా జరుగుతాయి. ఇకపోతే కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బెన్ స్టోక్స్ కెప్టెన్సీపై, కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టిన మెక్కల్లమ్ మార్గదర్శకత్వంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో 17టెస్ట్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచిన ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

ఈ సిరీస్ గెలిచి తప్పకుండా టెస్టు ఛాంపియన్ షిప్ రేసులో నిలవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లూరుతుంది. గురువారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కు ఈ టెస్టు ప్రారంభమైంది. అంతకుముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున సీనియర్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది.

ఇకపోతే ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చిన స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్‌ను బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా అండర్సన్ మూడు ఓవర్లలో మూడు మెయిడిన్లు చేసి టామ్ లాథమ్ (1), విల్ యంగ్ (1)లను కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. 5ఓవర్లకు న్యూజిలాండ్ 2పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే ఆడుతున్నారు.

తుది జట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), కొలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), మ్యాటీ పాట్స్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

Story first published: Thursday, June 2, 2022, 16:09 [IST]
Other articles published on Jun 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+