Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Lord's Test: జానీ జానీ యస్ పప్ప.. స్లిప్‌లో క్యాచ్‌లు యమ గొప్ప, బెయిర్‌స్టో క్యాచ్‌లు వావ్..!

England Vs Newzealand 1st Test: Jonny Bairstow received excellent catches on the slip in Anderson bowling

కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో బరిలోకి దిగింది. లార్డ్స్‌లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్లు స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించారు. క్రీజులో నిల్చోవాలంటేనే ముచ్చెమటలు పట్టించేలా తమ స్వింగ్ బంతులతో ముప్పుతిప్పలు పెట్టారు. ఇకపోతే వరుసగా నాలుగు మెయిడిన్లు వేసిన జేమ్స్ అండర్సన్ ఆదిలోనే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను గట్టిదెబ్బతీశాడు. అండర్సన్ దెబ్బకు 2పరుగులకే 2వికెట్లు కోల్పోయింది.

డైవ్ చేసి ఒక్క చేత్తో..

ఇక ఈ రెండు వికెట్లు పడడంలో అండర్సన్ పాత్ర ఎంతుందో.. జానీ బెయిర్ స్టో పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే స్లిప్పులో అద్భుతమైన ఫీల్డింగ్‌తో బెయిర్ స్టో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో ఆ వికెట్లొచ్చాయి. ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్‌ల బ్యాట్‌కు ఎడ్జ్ అయి థర్డ్ స్లిప్‌లకు బంతి వెళ్లింది. దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండి బెయిర్ స్టో ఆ క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత అండర్సన్ బౌలింగ్లో కవర్ డ్రైవ్ ఆడడానికి యంగ్ ప్రయత్నించగా.. అది ఎడ్జ్ అయింది. స్లిప్ వైపు వెళ్లింది. ఇక హుటాహుటిన డైవ్ చేసిన బెయిర్ స్టో ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అత్యంత అద్భుత రీతిలో బెయిర్ స్టో క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ స్టోక్స్ సహా జట్టు ప్లేయర్లందరూ ఫుల్ జోష్ లో సెలబ్రేషన్లు చేసుకున్నారు.

వాటే స్పాంటెనిటీ

రెండోసారి అండర్సన్ ఒక లెంత్ డెలివరీ వయగా.. లాథమ్ బ్యాక్ ఫుట్‌లో ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ అయి థర్డ్ స్లిప్‌లో నేరుగా బెయిర్‌స్టో వద్దకు వెళ్లాడు. తొలుత బంతి బెయిర్ స్టో చేతిలో పడి బంతి బౌన్స్ అయి మళ్లీ కిందపడేలోపు.. వెంటనే డైవ్ చేసి దాదాపు భూమిని తాకే టైంలో అద్భుతంగా బెయిర్ స్టో తిరిగి పట్టుకున్నాడు. అతని స్పాంటెనిటీని ప్లేయర్లు అందరూ మెచ్చుకోవడంతో పాటు ఫుల్ సంబరాలు చేసుకున్నారు.

టీ బ్రేక్ తర్వాత మారిపోయిన ఆట

టీ బ్రేక్ తర్వాత మారిపోయిన ఆట

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132పరుగులకే కుప్పకూలింది. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలుత బాగా ఆడింది. మూడో సెషన్ టీ బ్రేక్ సమయానికి 23ఓవర్లలో వికెట్ నష్టానికి 75పరుగులు చేసింది. జాకీ క్రాలీ(43) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ ఆట పూర్తిగా మారిపోయింది. కైలీ జేమీసన్, డి గ్రాండ్ హోమ్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.. స్వింగర్లు, లైన్ అండ్ లెంత్ బాల్స్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో అలెక్స్ లీస్(25), ఓలీ పోప్ (7), జో రూట్ (11), జానీ బెయిర్ స్టో (1), కెప్టెన్ బెన్ స్టోక్స్ (1), మాథ్యు పాట్స్ (0), క్రీజులో నిలవలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7వికెట్లు కోల్పోయి 116పరుగులు చేసింది.

Story first published: Friday, June 3, 2022, 14:55 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+