బెయిర్ స్టో వరుసగా రెండో సెంచరీ: భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్

హైదరాబాద్: చెస్టర్ లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లో 14 పోర్లు, ఒక సిక్స్ సాయంతో బెయిర్ స్టో 100 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో బెయిర్ స్టోకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ అరుదైన ఘనత సాధించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా జానీ బెయిర్ స్టో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెయిర్ స్టో, కెవిన్ పీటర్స్.... జో రూట్‌ల సరసన చేరాడు.
2006/07 ప్రపంచకప్‌లో కెవిన్ పీటర్స్ రెండు సెంచరీలు చేయగా... ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో జో రూట్, జానీ బెయిర్ స్టో రెండు సెంచరీలు సాధించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 31 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
క్రీజులో జానీ బెయిర్ స్టో(100), జోస్ బట్లర్ (6) పరుగులతో ఉన్నారు. అంతకముందు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 123 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాసన్ రాయ్(60) పరుగులు చేసి జేమ్స్ నిశమ్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ 25 బంతుల్లో 24(ఒక ఫోర్) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే:
2 - Kevin Pietersen, 2006/07
2 - Joe Root, 2019
2 - Jonny Bairstow, 2019*
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications