కివీస్ బౌలర్ల కట్టడి: బెయిర్ స్టో సెంచరీ, న్యూజిలాండ్ విజయ లక్ష్యం 306

England vs New Zealand Live Score, World Cup 2019: Black Caps Restrict England to 305/8

హైదరాబాద్: చెస్టర్ లీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జానీ బెయిర్ స్టో 99 బంతుల్లో 106(15 పోర్లు, ఒక సిక్స్) సెంచరీతో చెలరేగగా... జేసన్ రాయ్ 61 బంతుల్లో 60(8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 306 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ తలో రెండు వికెట్లు తీసుకోగా... టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్‌లు తలో ఒక వికెట్ తీశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. అయితే, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాసన్ రాయ్(60) పరుగులు చేసి జేమ్స్ నిశమ్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

194 పరుగులకే రెండు వికెట్లు

అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ 25 బంతుల్లో 24(ఒక ఫోర్) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 194 పరుగులకే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ జాన్ బెయిర్ స్టో 95 బంతుల్లో 14 పోర్లు, ఒక సిక్స్ సాయంతో బెయిర్ స్టో 100 పరుగులు చేశాడు.

వరుసగా బెయిర్ స్టో రెండో సెంచరీ

ఈ ప్రపంచకప్‌లో బెయిర్ స్టోకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ అరుదైన ఘనత సాధించాడు. గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా జానీ బెయిర్ స్టో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

350పైకి పైగా స్కోరు సాధిస్తుందని

దీంతో ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెయిర్ స్టో, కెవిన్ పీటర్స్.... జో రూట్‌ల సరసన చేరాడు. ఈ జోరు చూస్తే ఇంగ్లాండ్ అలవోకగా 350పైకి పైగా స్కోరు సాధిస్తుందని అనుకున్నారు. అయితే, జట్టు స్కోరు 206 పరుగుల వద్ద బెయిర్‌స్టో మ్యాచ్ హెన్రీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

బెయిర్ స్టో ఔటైన తర్వాత

బెయిర్ స్టో ఔటైన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో దూకుడు తగ్గింది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకానొక దశలో 194/2తో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ 248/5తో నిరాశపరిచింది. ఈ క్రమంలో 26 బంతుల్లో 3 వికెట్లు చేజార్చుకొని 20 పరుగులే చేసింది.

కట్టడి చేసిన కివీస్ బౌలర్లు

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్(11), బెన్‌ స్టోక్స్(11), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(42), క్రిస్ వోక్స్(4), అదిల్ రషీద్(16) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ తలో రెండు వికెట్లు తీసుకోగా... టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్‌లు తలో ఒక వికెట్ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 3, 2019, 19:02 [IST]
Other articles published on Jul 3, 2019

Latest Videos

    + More
    POLLS
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more