టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. అయితే, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాసన్ రాయ్(60) పరుగులు చేసి జేమ్స్ నిశమ్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
194 పరుగులకే రెండు వికెట్లు
అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ 25 బంతుల్లో 24(ఒక ఫోర్) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 194 పరుగులకే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ జాన్ బెయిర్ స్టో 95 బంతుల్లో 14 పోర్లు, ఒక సిక్స్ సాయంతో బెయిర్ స్టో 100 పరుగులు చేశాడు.
వరుసగా బెయిర్ స్టో రెండో సెంచరీ
ఈ ప్రపంచకప్‌లో బెయిర్ స్టోకు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ అరుదైన ఘనత సాధించాడు. గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా జానీ బెయిర్ స్టో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
350పైకి పైగా స్కోరు సాధిస్తుందని
దీంతో ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెయిర్ స్టో, కెవిన్ పీటర్స్.... జో రూట్‌ల సరసన చేరాడు. ఈ జోరు చూస్తే ఇంగ్లాండ్ అలవోకగా 350పైకి పైగా స్కోరు సాధిస్తుందని అనుకున్నారు. అయితే, జట్టు స్కోరు 206 పరుగుల వద్ద బెయిర్‌స్టో మ్యాచ్ హెన్రీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
బెయిర్ స్టో ఔటైన తర్వాత
బెయిర్ స్టో ఔటైన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో దూకుడు తగ్గింది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఒకానొక దశలో 194/2తో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ 248/5తో నిరాశపరిచింది. ఈ క్రమంలో 26 బంతుల్లో 3 వికెట్లు చేజార్చుకొని 20 పరుగులే చేసింది.
కట్టడి చేసిన కివీస్ బౌలర్లు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్(11), బెన్ స్టోక్స్(11), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(42), క్రిస్ వోక్స్(4), అదిల్ రషీద్(16) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ తలో రెండు వికెట్లు తీసుకోగా... టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్‌లు తలో ఒక వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












