Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ థ్రిల్లర్: 44 ఏళ్ల తర్వాత విశ్వవిజేతగా ఇంగ్లాండ్

England

హైదరాబాద్: ప్రపంచకప్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బౌల్‌​ వేసిన ఓవర్‌లో 15 పరుగులు సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

స్టోక్స్‌, బట్లర్‌లు బౌల్ట్‌ బౌలింగ్‌ల్‌ ఎదురుదాడికి దిగడంతో సూపర్ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా, గుప్టిల్ రనౌట్‌ అయ్యాడు. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది.

దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు. దీంతో 44 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ విశ్వ విజేతగా నిలిచింది.

అంతకముందు హెన్రీ నికోల్స్ 77 బంతుల్లో 55(4 ఫోర్లు), టామ్ లాథమ్ 56 బంతుల్లో 47(2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.

1
43691

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి తోడు... జోస్ బట్లర్ (60 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు)లతో రాణించడంతో ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లకు చెరో 3 వికెట్లు తీయగా, మ్యాట్ హెన్రీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లకు చెరొ వికెట్ దక్కింది.

Story first published: Monday, July 15, 2019, 0:31 [IST]
Other articles published on Jul 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+