For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5 runs or 6?: బెన్ స్టోక్స్ ఓవర్‌త్రో ఘటనపై ఎట్టకేలకు స్పందించిన ఐసీసీ

England vs New Zealand: 5 runs or 6? ICC breaks silence on Ben Stokes overthrows incident

హైదరాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న బెన్ స్టోక్స్ ఓవర్‌త్రో ఘటనపై ఎట్టకేలకు ఐసీసీ స్పందించింది. మైదానంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కివీస్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ఇంగ్లండ్‌కు చివ‌రి ఓవ‌ర్‌లో.. ఓవ‌ర్‌త్రో రూపంలో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. ఇదే, న్యూజిలాండ్ ఓటమికి కారణమైంది. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి ఓవర్‌ చివరి మూడు బంతులకు గాను 9 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ చేయగా బెన్‌స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు.

మొత్తం ఆరు పరుగులిచ్చిన అంఫైర్లు

మొత్తం ఆరు పరుగులిచ్చిన అంఫైర్లు

రెండు ప‌రుగులు తీశాడు. రెండు ప‌రుగుల‌తోనే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి అది. రెండో పరుగును కోసం ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవ‌డానికి క్రీజులోకి డైవ్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి.

మాట్లాడేందుకు నిరాకరించిన ఐసీసీ

మాట్లాడేందుకు నిరాకరించిన ఐసీసీ

స్టోక్స్, రషీద్‌ చేసిన 2 పరుగులతో కలిపి అంపైర్‌ ధర్మసేన దానిని 6 పరుగులుగా ప్రకటించాడు. స్టోక్స్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్‌ సైమన్‌ టోఫెల్‌ సైతం తప్పు పట్టారు. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ ముందు మీడియా ప్రస్తావించగా... దీనిపై మాట్లాడేందుకు నిరాకరించింది.

నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం

నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం

"నిబంధనలపై అంపైర్లుకు ఉన్న అవగాహన మేరకు మైదానంలో వారు నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకున్న ఏ నిర్ణయాలపైనా అయినా నిబంధనల ప్రకారం మేం మాట్లాడలేం" అని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఓవర్‌త్రో ఘటనలో ఫీల్డ్ అంఫైర్లు కుమార ధర్మసేన, ఎరాస్మస్ తప్పుగా నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సైమన్ టోఫెల్

అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సైమన్ టోఫెల్

ఐసీసీ నుంచి ఐదు సార్లు అత్యుత్తమ అంఫైర్‌ అవార్డు అందుకున్న మాజీ అంపైర్ సైమన్ టోఫెల్ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఐసీసీలోని 19.8 రూల్ ప్ర‌కారం.. ఓవ‌ర్‌త్రో రూపంలో బంతి బౌండ‌రీ వెళ్లినా లేక ఫీల్డ‌ర్ కావాల‌ని అడ్డుకున్న‌ప్పుడు బంతి బౌండ‌రీ దాటిన సంద‌ర్భాల్లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో 19.8 రూల్ చెబుతుంది.

ఆ రూల్ ప్ర‌కారం ఇంగ్లాండ్‌కు 5 పరుగులు ఇవ్వాలి

ఆ రూల్ ప్ర‌కారం ఇంగ్లాండ్‌కు 5 పరుగులు ఇవ్వాలి

ఆ రూల్ ప్ర‌కారం ఇంగ్లాండ్‌కు 5 పరుగులు మాత్ర‌మే ఇవ్వాలి. కానీ, అంపైర్ ధ‌ర్మ‌సేన త‌న స‌హ‌చ‌రుల‌తో చ‌ర్చించి ఆరు ప‌రుగులు ఇచ్చాడు. టోఫెల్ మాట్లాడుతూ "నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్‌ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్‌ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్‌ స్ట్రయికింగ్‌ తీసుకోవాల్సి వచ్చేది" అని ఆయన అన్నారు.

Story first published: Tuesday, July 16, 2019, 15:21 [IST]
Other articles published on Jul 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+