Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!

daryl mitchell

ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌ హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడోది, మరియు చివరిదైన టెస్టులో న్యూజిలాండ్ ఆట ఇప్పుడే మొదలైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎప్పటిలాగే టాపార్డర్ పెద్దపెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇక మళ్లీ డారిల్ మిచెల్, టామ్ బ్లండెలే న్యూజిలాండ్‌కు దిక్కయ్యారు. ఇక ఈ సిరీస్లో మూడు సెంచరీలు చేసిన డారిల్ మిచెల్‌ను ఔట్ చేసేదాకా.. ఇంగ్లాండ్‌కు విజయం అందనట్టే. ఒకవేళ ఔట్ చేస్తే.. ఇంగ్లాండ్ గెలవడానికి మరిన్ని అవకాశాలుంటాయి. ఇక 3వ రోజు ఆట ముగిసే టైంకు న్యూజిలాండ్ 5వికెట్లు కోల్పోయి 168పరుగులు చేసింది. ఫలితంగా 137పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ లాథమ్ (76పరగులు 10బంతుల్లో 12ఫోర్లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (48పరుగులు 115బంతుల్లో 8ఫోర్లు) రాణించారు. విల్ యంగ్ (8), డెవాన్ కాన్వే (11), హెన్రీ నికోల్స్ (7) నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (4పరుగులు 17బంతుల్లో), టామ్ బ్లండెల్ (5పరుగులు 13బంతుల్లో) ఉన్నారు. వీళ్లిద్దరు ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యలా క్రీజులో పాతుకుపోయి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మాటీ పాట్స్ 2 వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రూట్, జేమీ ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు.

ఇకపోతే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో (162పరుగులు 157బంతుల్లో 24బంతుల్లో) సెంచరీతో చెలరేగగా.. జేమీ ఓవర్టన్ (97పరుగులు 136బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు), స్టువర్ట్ బ్రాడ్ (42పరుగులు 36బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 360పరుగులు చేసి 31పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ బౌలర్టలో ట్రెంట్ బౌల్ట్ 4, నీల్ వాగ్నర్ 2, సౌతీ 3 వికెట్లు తీసుకోగా.. మైఖేల్ బ్రేస్ వెల్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 329 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడంతో ఆ జట్టు ఈ పరుగులు చేయగలిగింది.

Story first published: Saturday, June 25, 2022, 23:14 [IST]
Other articles published on Jun 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+