For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌.. 85 పరుగులకే ఆలౌట్‌

ENG VS IRE : Tim Murtagh, Andy Balbirnie Help Ireland Lead England By 122 Runs || Oneindia Telugu
England vs Ireland, Only Test: Tim Murtagh, Andy Balbirnie help Ireland lead England by 122 runs

లార్డ్స్‌: వన్డేల్లో ప్రపంచకప్‌ సాధించిన ఇంగ్లండ్‌ టెస్టుల్లో పూర్తిగా తేలిపోయింది. ఇంగ్లండ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాక్ ఇచ్చింది. బుధవారం లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఐర్లాండ్‌ పేస్ బౌలర్ టిమ్ ముర్టాగ్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్‌ కకలావికలం అయింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

చెలరేగిన టిమ్‌ ముర్తాగ్‌:

చెలరేగిన టిమ్‌ ముర్తాగ్‌:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను టిమ్‌ ముర్తాగ్‌ ఆరంభంలోనే దెబ్బతీశాడు. మూడో ఓవర్లో జేసన్‌ రాయ్‌ (5)ను ఔట్‌ చేసాడు. డెన్లీ (23), బర్న్స్‌ (6) కాసేపు నిలవడంతో ఇంగ్లాండ్‌ కుదురుకుంది. ఈ సమయంలో ఐర్లాండ్‌ బౌలర్లు చెలరేగడంతో.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డేన్లీ (23), కరన్‌ (18), స్టోన్‌ (19) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 49 పరుగుల తేడాతో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ వంద పరుగుల్లోపే ఆలౌటైంది. ఐర్లాండ్‌ బౌలర్లలో ముర్తాగ్‌కు తోడుగా మార్క్‌ అదైర్‌ మూడు, ర్యాంకిన్‌ రెండు వికెట్లు తీశారు.

122 పరుగుల ఆధిక్యం:

122 పరుగుల ఆధిక్యం:

అనంతరం ఐర్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. పోర్టర్‌ ఫీల్డ్(14), జేమ్స్ మెక్‌కల్లమ్(19) 19 ఓవర్లలోపే ఔట్ అయ్యారు. ఆ తర్వాత బాల్బిర్నీ (55) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఇక స్టిర్లింగ్ (36), ఓబ్రెయిన్ (28) కూడా కాసేపు క్రీజులో నిలిచారు. చివరలో మెక్‌బ్రెయిన్ (11), ముర్టాగ్ (16) పోరాడంతో 207 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఐర్లాండ్‌ 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోన్, కరన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓ ఓవర్ ఆడిన అనంతరం తొలి రోజు ఆట ముగిసింది.

గతేడాదే టెస్టు అరంగేట్రం:

గతేడాదే టెస్టు అరంగేట్రం:

వన్డేల్లో గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌ సంప్రదాయ టెస్టు క్రికెట్‌లోనూ సత్తా చాటింది. గతేడాదే టెస్టు అరంగేట్రం చేసిన ఐర్లాండ్‌ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లే ఆడింది. తొలి టెస్టులో పాకిస్తాన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులోనూ ఓడినా మంచి ప్రదర్శన చేసింది. తాజాగా ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చింది. ఐర్లాండ్‌ జట్టులో కౌంటీల్లో ఆడిన అనుభవం ఉన్నపేసర్‌ టిమ్‌ ముర్టాగ్‌ జట్టుకు ఉపయోగపడ్డాడు.

Story first published: Thursday, July 25, 2019, 9:29 [IST]
Other articles published on Jul 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+