Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

38 పరుగులకే ఐర్లాండ్‌ ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ ఘన విజయం

England vs Ireland: Ireland Allout for 38, England win by 143 runs

లార్డ్స్‌: ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. క్రిస్‌ వోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ విరుచుకుపడడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ కేవలం 38 పరుగులకే ఆలౌట్ అవవడంతో 143 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. దీంతో టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకోవాలనుకున్న ఐర్లాండ్‌ ఆశలు ఆవిరయ్యాయి.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

వోక్స్‌, బ్రాడ్‌ విజృంభణ:

వోక్స్‌, బ్రాడ్‌ విజృంభణ:

ఐర్లాండ్‌ మూడో రోజు 182 పరుగుల ఛేదనకు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసిన ఐర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏదైనా సంచలనం చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ బౌలర్లు అందుకు అవకాశం ఇవ్వలేదు. నాలుగో ఓవర్‌ చివరి బంతికి కెప్టెన్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (2)ను వోక్స్‌ పెవిలియన్‌ పంపాడు. వెంటనే బాల్‌బ్రైన్‌ (5)ను బ్రాడ్‌ ఔట్ చేసాడు. స్వింగ్‌ను ఉపయోగించుకున్న వోక్స్‌.. స్టిర్లింగ్‌ (0)ను ఖాతా తెరవనీయలేదు. జేమ్స్‌ మెకల్లమ్‌ (11), విల్సన్‌ (0) లను మూడు బంతుల వ్యవధిలో వోక్స్‌ ఔట్‌ చేశాడు. దీంతో ఐర్లాండ్‌ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

38 పరుగులకే:

38 పరుగులకే:

ఈ సమయంలో బ్రాడ్‌ విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ఇక ముర్టాగ్‌ (2) వోక్స్‌ బోల్డ్ చేసి ఆలౌట్ చేసాడు. 14 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ 15.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌటైంది. ముగ్గురు డకౌటవగా.. మరొకరు సున్నా పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. మెకల్లమ్‌ చేసిన 11 పరుగులే అత్యధిక స్కోర్. మూడో బౌలర్‌ ప్రమేయం లేకుండా ఐర్లాండ్‌ ఆలౌట్ అవ్వడం విశేషం. వోక్స్‌ (6/17), బ్రాడ్‌ (4/19) గణాంకాలు నమోదు చేశారు.

 85 పరుగులకే ఆలౌట్:

85 పరుగులకే ఆలౌట్:

ఓవర్‌నైట్‌ స్కోరు 303/9తో శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ అదే స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 23.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లాండ్‌ పేస్ బౌలర్ టిమ్ ముర్టాగ్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్‌ కకలావికలం అయింది. అనంతరం ఐర్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి ఆలౌటైంది. బాల్బిర్నీ (55) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. స్టిర్లింగ్ (36), ఓబ్రెయిన్ (28) పరుగులు చేశారు. జాక్‌ లీచ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Saturday, July 27, 2019, 10:30 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+