మొదలైన వన్డే క్రికెట్‌.. ఇంగ్లండ్ జోరు.. 7 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య బయో బబుల్ వాతావరణంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) టెస్టు సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అదే జోరులో వన్డే సిరీస్‌కు కూడా ఏర్పాట్లు చేసింది. ఐసీసీ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌-ఐర్లాండ్‌ జట్ల మధ్య తొలి వన్డే గురువారం సౌతాంప్టన్‌లో ఆరంభమైంది. నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో వన్డే మ్యాచ్ జరుగుతుండడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు.

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో జో డెన్లీ గాయపడటంతో అతని స్థానంలో శామ్‌ బిల్లింగ్స్‌ జట్టులోకి వచ్చాడు. టాస్‌ ఓడిన ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే ఇంగ్లీష్ పేసర్ డేవిడ్‌ విల్లే ఓపెనర్‌ పౌల్‌ స్టర్లింగ్‌ (2)ను పెవిలియన్‌ పంపాడు. మూడో ఓవర్లలో కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (3) వికెట్ పడగొట్టాడు. 6వ ఓవర్లో మరో పేసర్ సాకిబ్ మహమూద్.. హ్యారీ టెక్టర్‌ను డకౌట్ చేశాడు. దీంతో ఐర్లాండ్‌ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక ఏడో ఓవర్లో డేవిడ్‌ విల్లే మరోసారి విజృంభించాడు. రెండో బంతికి ఓపెనర్ గారెత్ డెలానీ (22)ను క్యాచ్ ఔట్ రూపంలో వెనక్కి పంపాడు. మూడో బంతికి వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్‌ను డకౌట్ చేశాడు. విల్లే వరుస బంతుల్లో రెండు వికెట్లు పడడగొట్టడంతో.. 7 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏఈ దశలో కెవిన్ ఓ బ్రైన్, కర్టిస్ కాంపర్ 6 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఐర్లాండ్‌‌ 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. క్రీజులో ఓ బ్రైన్ (7), కాంపర్ (13) పరుగులతో ఉన్నారు. డేవిడ్‌ విల్లే నాలుగు వికెట్లు తీయగా.. సాకిబ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Teams:

England: Jason Roy, Jonny Bairstow (wk), James Vince, Eoin Morgan (c), Tom Banton, Sam Billings, Moeen Ali, David Willey, Adil Rashid, Tom Curran, Saqib Mahmood.

Ireland: Paul Stirling, Gareth Delany, Andrew Balbirnie (c), Harry Tector, Kevin O Brien, Lorcan Tucker (wk), Simi Singh, Curtis Campher, Andy McBrine, Barry McCarthy, Craig Young.

ఆ క్రికెటర్‌కు 5సార్లు కరోనా పాజిటివ్‌.. చివరికి నెగెటివ్‌!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Read more about: david willey eoin morgan
Story first published: Thursday, July 30, 2020, 19:52 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X