INDvENG: కోహ్లీ సేనపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లాండ్ జట్టు


హైదరాబాద్: హైదరాబాద్: భారత్ జట్టుతో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్ రెండో టీ20లో విజయాన్ని సాధించింది. టీమిండియా పరాజయానికి ఒకే ఒక్కడు కారణమైయ్యాడు. తక్కువ స్కోరైనా కాపాడుకుంటుందనుకున్న తరుణంలో.. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్(58; 41 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను ఆతిథ్య జట్టు 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇండియా ఇన్నింగ్స్:
టీమిండియాను చక్కని వ్యూహంతో కట్టడి చేసింది ఇంగ్లాండ్. తొలి మ్యాచ్‌లో విజయాన్ని కొనసాగిద్దామని బరిలోకి దిగిన టీమిండియా పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే 5 వికెట్ల 5 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్‌కు 149 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది టీమిండియా. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కోహ్లీ, ధోనీ జాగ్రత్తగా ఆడారు. రోహిత్ శర్మ 6, ధావన్ 10, రాహుల్ 6 పరుగులు చేశారు. కోహ్లీ 47, రైనా 27, ధోనీ 32 , పాండ్యా 12 పరుగులు చేశారు.
మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఒకొక్కటిగా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికే 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుత రన్‌రేట్ కనీసం కంటే తక్కువగా ఉండటంతో ఇంగ్లాండ్‌కు టార్గెట్‌ను ఇవ్వడంలో పొదుపు చూపించేట్లుగా కనిపిస్తోంది టీమిండియా. భారత్ మూడు వికెట్లను ఇలా కోల్పోయింది. రెండో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ ఐదు బంతులు ఆడి 9 పరుగులు మాత్రమే చేశాడు. 4.2 ఓవర్‌లో శిఖర్ ధావన్ పరుగు తీసే క్రమంలో జాసన్ రాయ్ చేతుల్లో రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే (4.5వ బంతి) తొలి టీ20లో దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ సైతం ప్లంకెట్ చేతికి చిక్కి పదికి మించని స్కోరుతో సరిపెట్టుకున్నాడు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో సురేశ్ రైనా(16), విరాట్ కోహ్లీ(14) ఉన్నారు.
టాస్ రిపోర్టు:
కార్డిఫ్ వేదికగా ఆడబోతున్న మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ముందుగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు మోర్గాన్ చెప్పాడు. ఇరు జట్లలో ఎలాంటి మర్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
గత మూడు టీ20ల్లోనూ భారత్‌కు బ్యాటింగ్‌లో శుభారంభమే లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తలో మ్యాచ్‌లో మెరుస్తుండగా, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు బాగా కలిసొచ్చే అంశం. ఆ తర్వాతి స్థానాల్లో కెప్టెన్ కోహ్లీ, రైనా, ధోనీ, హర్దిక్ పాండ్య కూడా ఇదే జోరు కొనసాగిస్తే స్కోరుబోర్డు మరోసారి పరుగులు పెట్టినట్లే. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ గడ్డపై భారత్ స్పిన్నర్లు మాయ చేసేస్తున్నారు.
కానీ మొదటి మ్యాచ్‌లో చాహల్ కాస్త ఇబ్బందిపడ్డాడు. మరోవైపు కులదీప్ బౌలింగ్‌ను అర్ధం చేసుకోవడానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరోసారి మెర్లిన్(బౌలింగ్ యంత్రం)తో ప్రాక్టీస్ చేశారు. అతను ఏవిధంగా బంతులు విసురుతాడో అన్ని రకాలుగా మెర్లిన్ సహాయంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మాయ సాగుతుందో లేదో చూడాలి. అదేవిధంగా తొలి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులిచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మరో బౌలర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు ఏవిధంగా అడ్డుకుంటారో చూడాల్సిందే.
ఇంగ్లాండ్ జట్టు:
Jason Roy, Jos Buttler (wk), Alex Hales, Eoin Morgan (c), Jonny Bairstow, Joe Root, David Willey, Chris Jordan, Liam Plunkett, Adil Rashid, Jake Ball
భారత జట్టు:
Rohit Sharma, Shikhar Dhawan, Lokesh Rahul, Virat Kohli (c), Suresh Raina, MS Dhoni (wk), Hardik Pandya, Yuzvendra Chahal, Kuldeep Yadav, Bhuvneshwar Kumar, Umesh Yadav
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications