Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్టుకు తొలి రోజు గంట కొట్టనున్న సచిన్

England vs India: Sachin Tendulkar, Ravi Shastri to ring 5-minute bell at Lords

లండన్: ఇంగ్లాండ్-ఇండియాల మధ్య రెండో టెస్టు జరగడానికి ముందే ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదుగా ఆరంభించనున్నారు. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఏదైనా మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు. పర్యాటక జట్టుకు సంబంధించిన వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్‌ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

తొలి రోజు మ్యాచ్‌ గంటను మోగించాల్సిందిగా సచిన్‌ను:

తొలి రోజు మ్యాచ్‌ గంటను మోగించాల్సిందిగా సచిన్‌ను:

ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌ సమయంలోనూ ప్రతి రోజూ ఇలా ఎవరో ఒకరు గంట మోగిస్తారు. గురువారం లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తొలి రోజు మ్యాచ్‌ను గంట మోగించి ప్రారంభించాల్సిందిగా మైదానం నిర్వాహకులు అడిగితే వెంటనే ఒప్పుకున్నాడట. మూడో రోజు కోసం రవిశాస్త్రిని సంప్రందించగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది.

ఐదో రోజు ఎవరు మోగిస్తారో వెల్లడించలేదు:

ఐదో రోజు ఎవరు మోగిస్తారో వెల్లడించలేదు:

రెండు, నాలుగు రోజుల్లో టెడ్‌ డెక్టర్‌, అన్య శుభ్‌సోలీ గంట కొట్టనున్నారు. ఇక ఐదో రోజు ఎవరు బెల్‌ మోగిస్తారో నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. 2007 నుంచి లార్డ్స్‌లో బెల్‌ మోగించి మ్యాచ్‌ను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. భారత్‌ నుంచి ఇప్పటి వరకు మన్సూర్‌ అలీఖాన్‌ పటౌటీ, సునీల్‌ గావస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, రాహుల్‌ ద్రవిడ్‌, కపిల్‌ దేవ్‌, సౌరభ్‌ గంగూలీలు లార్డ్స్‌లో గంట మోగించారు. సచిన్ టెండూల్కర్ గంట మోగించడం ఇదే మొదటి సారి.

లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో ఇద్దరు కెప్టెన్లు మాత్రమే

లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో ఇద్దరు కెప్టెన్లు మాత్రమే

ఈ మైదానంలో ఇప్పటివరకూ టీమిండియా ఆడిన 17 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం పొందింది. కాగా నాలుగింటిలో డ్రాగా నిలిచి.. 11మ్యాచ్‌లలో మాత్రం ఓడిపోయింది. ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో విజయాలను సాధించారు. భారత మాజీ కెప్టెన్లు కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్‌ ఇప్పటి వరకు లార్డ్స్‌లో విజయాలు నమోదు చేసుకుంది. 1986లో కపిల్‌ దేవ్ కెప్టెన్సీలో భారత్‌ లార్డ్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

రెండో సారి లార్డ్స్‌లో.. ధోని నాయకత్వంలో:

రెండో సారి లార్డ్స్‌లో.. ధోని నాయకత్వంలో:

ఈ మ్యాచ్‌లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వంలో భారత్‌ రెండో సారి లార్డ్స్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. కుక్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ధోని నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.

Story first published: Thursday, August 9, 2018, 14:59 [IST]
Other articles published on Aug 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+