
గాయంతో గిల్ ఔట్
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు స్వదేశానికి వచ్చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని కోరిందట.
అయితే ఈ రిక్వెస్ట్‌ను భారత సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా మరో ఇద్దరు ఎందుకన్న ఉద్దేశంలో విజ్ఞప్తిని పట్టించుకోలేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

శ్రీలంకలోనే షా, పడిక్కల్
పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ల విషయమై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యం మధ్య సఖ్యత కనిపించట్లేదని ఇటీవల వార్తలు వెలుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. షా, పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపించట్లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ శ్రీలంకలోనే మ్యాచులు ఆడతారని తెలిపారు. 'పృథ్వీ షా శ్రీలంకలోనే ఉండి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడతాడు.
అతడిని ఆ సిరీస్ కోసమే ఎంపిక చేశాం. అతడు తన కమిట్మెంట్ను పూర్తి చేస్తాడు. శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలిస్తాం. ప్రస్తుతమైతే ఏ ఆలోచన లేదు. పడిక్కల్ విషయంలోనూ అంతే' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

వారు విఫలమయితేనే ఈశ్వరన్‌కు చోటు
బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపించడం కూడా చర్చనీయాంశమైంది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై మాట్లాడిన సదరు బీసీసీఐ అధికారి.. ఈశ్వరన్ అనుకున్న స్థాయిలో రాణిస్తాడనే నమ్మకం లేక ఇద్దరు ఓపెనర్లను కోరినట్లు తెలిపారు.
ఈశ్వరన్‌ను జట్టులోకి ఎంపికచేసేటప్పుడు కెప్టెన్, మేనేజ్మెంట్ ఎందుకు ప్రశనించాలదన్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ విఫలమయితేనే ఈశ్వరన్‌కు తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందని ఆయన అన్నారు.

20 రోజుల పాటు విశ్రాంతి
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం అక్కడే ఉన్న టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో ఆరు వారాల సమయం ఉండడంతో బీసీసీఐ కోహ్లీసేనకు 20 రోజుల పాటు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు లండన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. వింబుల్డన్ మ్యాచ్‌లు కూడా చూస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ నెల 14న మళ్లీ భారత ఆటగాళ్లంతా లండన్‌లో కలవనున్నారు. అక్కడి నుంచి డర్హమ్ వెళ్లి రెండు వారాల పాటు ట్రెయినింగ్ సెషన్స్, కౌంటీ ఎలెవన్ జట్టుతో సన్నాహక మ్యాచ్ ఆడతారు. ఇక ఆగష్టు 4 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications

భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటిన కెప్టెన్.. టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్లిన 'బెంగాల్ టైగర్'!










