బుమ్రా, సుందర్ ఔట్: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీసేనకు షాక్

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ చేతి వేలి గాయంతో డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యారు.
ఐర్లాండ్‌తో గత బుధవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ బాదిన బంతిని రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో అతడి వేలికి దెబ్బ తగిలింది. బీసీసీఐ వైద్య బృందం అతడి వేలిని స్కానింగ్ కూడా తీయించింది.
డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టును వణుకు పుట్టించే బుమ్రా జట్టుకు దూరమవడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడుతుండగా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కుడి పాదానికి గాయమైంది. దీంతో అతడు కూడా సిరీస్‌కు దూరమయ్యాడు.
టీ20 సిరీస్ ముగిసేలోగా అతడు కోలుకుంటే వన్డే సిరీస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటన అనంతరం కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో సిరిస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మంగళవారం నుంచి ఆరంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications