Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా వచ్చినా.. విహార యాత్రలోనే టీమిండియా ప్లేయర్స్! వింబుల్డన్‌లో అశ్విన్‌! ఏదైనా జరిగితే

England vs India: Fans slams BCCI over Indian cricketers break to continue in UK

హైదరాబాద్: గత నెలలో ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం అక్కడే ఉన్న టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌ సిరీస్ మధ్యలో ఆరు వారాల సమయం ఉండడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోహ్లీసేనకు 20 రోజుల పాటు విశ్రాంతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు లండన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. దొరికిందే సందని వింబుల్డన్​ మ్యాచ్​లు కూడా చూస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా:

ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా:

మంగళవారం ఇంగ్లండ్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా ఈసీబీలో ఆందళన నెలకొంది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే పూర్తయ్యాక సోమవారం ఇంగ్లండ్ ఆటగాల్లదరికీ పరీక్షలు నిర్వహించారు. మంగళవారం వెలుబడిన రిపోర్టులో ఏడుగురు వైరస్‌ బారిన పడ్డారని తేలింది.దాంతో అందరిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో భారత ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌లోకి వెళ్లమనే ఆదేశాలు జారీ చేస్తారేమోనని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు. తాజాగా ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ఇప్పటికీ భారత ఆటగాళ్లు విహార యాత్రలను కొనసాగిస్తున్నారని చెప్పారు.

కుదింపు చేసుకోవాలని చెప్పలేదు:

కుదింపు చేసుకోవాలని చెప్పలేదు:

'ఇంగ్లండ్‌లో ఏం జరుగుతుందనేది మాకు తెలుసు. ఏదైనా ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తే వెంటనే మాకు సమాచారం వస్తుంది. వెంటనే ఆ నియమాలను కచ్చితంగా అమలుచేస్తాం. ఇప్పటికైతే మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆటగాళ్లకు తమ విశ్రాంతి సమయాన్ని కుదింపు చేసుకోవాలని చెప్పలేదు. చాలా మంది క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో విహరిస్తున్నారు. వాళ్లంతా ఒక్కసారి కలిసిపోతే కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతే బయోబుడగలోకి అనుమతిస్తారు' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

 ఆటగాళ్లకు ఏదైనా జరిగితే:

ఆటగాళ్లకు ఏదైనా జరిగితే:

ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా వచ్చినా.. భారత ఆటగాళ్లు వింబుల్డన్​ మ్యాచ్​లు చూస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహా మరికొందరు వింబుల్డన్​ మ్యాచ్​లకు హాజరయ్యారు. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా వచ్చినా.. టీమిండియా ప్లేయర్స్ మాత్రం విహార యాత్రలోనే ఉన్నారా', 'భారత ఆటగాళ్లకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి' అని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఆటగాళ్లను వెంటనే వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 14న కలవనున్న ప్లేయర్స్:

14న కలవనున్న ప్లేయర్స్:

ఈ నెల 14న మళ్లీ భారత ఆటగాళ్లంతా లండన్‌లో కలవనున్నారు. అక్కడి నుంచి డర్హమ్‌ వెళ్లి రెండు వారాల పాటు ట్రెయినింగ్‌ సెషన్స్, కౌంటీ ఎలెవన్‌ జట్టుతో సన్నాహక మ్యాచ్‌ ఆడతారు. ఆగష్టు 4 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టుతో భారత్ ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెల్సిందే. భారత్‌లో తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకొని ఇంగ్లండ్‌ చేరిన భారత క్రికెటర్లకు బుధవారం, శుక్రవారం రెండో డోసు వ్యాక్సిన్‌ ఇంగ్లండ్ ప్రభుత్వం వేయనుంది.

Story first published: Wednesday, July 7, 2021, 8:50 [IST]
Other articles published on Jul 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+