ఐదో టెస్టులో టీమిండియాతో ఆడనున్న ఇంగ్లాండ్ జట్టు ఇదే

కెన్నింగ్‌టన్: టెస్టు సిరీస్‌లో భాగంగా ఇండియాతో తలపడుతోన్న ఆతిథ్య ఇంగ్లాండ్ ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు జట్టును ప్రకటించేసింది. 3-1 ఆధిక్యంతో కొనసాగుతోన్న ఇంగ్లాండ్ జట్టులో చిన్నపాటి మార్పులు చేస్తూ.. జాబితాను ముందుంచుంది. అయితే ముందుగా అలెస్టర్ కుక్‌ను ఐదో టెస్టుకు జట్టు నుంచి దూరంగా ఉంచుదామనుకున్న సెలక్టర్లు ఇదే ఆఖరి టెస్టు కావడంతో అతనికి మళ్లీ తుది జట్టులో అవకాశం కల్పించారు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 13 మందితో కూడిన జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. బెన్ స్టోక్స్ స్థానంలో మళ్లీ జేమ్స్ విన్స్‌ను ఖరారు చేసింది. వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్‌ను.. ఫీల్డ్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోకు మరో అవకాశం కల్పించింది. అతనితో పాటుగా టెస్టు కెరీర్ సమస్యగా మారిన కీటోన్ జెన్నింగ్స్ మరో సారి నిరూపించుకునేందుకు అవకాశమిచ్చింది. కుక్ ఓపెనర్‌గా దిగి సిరీస్‌ను ముగింపు మ్యాచ్‌లో విజయంతో పూర్తి చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆరాటపడుతోంది.
క్రిస్ వోక్స్, ఒలి పోప్ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. కానీ, తుది జట్టు అయిన పదకొండు మందిలో ఈ సారి బరిలోకి దిగేముందు మార్పులు చేసేందుకు అవకాశముంది. గత మ్యాచ్‌లో మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసింది. కొద్ది మ్యాచ్‌లుగా పోప్ తన అవకాశాన్ని చేజార్చుకుంటుండటంతో ఇదే చివరి అవకాశంగా కనిపిస్తుంది.
అయితే జట్టులో స్థానం దక్కించుకున్న వోక్స్.. ఒకవేళ రషీద్ స్థానంలో ఆడితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ తొమ్మిదో స్థానం వరకూ ఆడే సూచనలున్నాయి. అలా జరిగినట్లు అయితే టీమిండియాకు తిప్పలు తప్పవు. ఈ క్రమంలో టీమిండియాతో ఆడనున్న ఆఖరిదైన ఐదో టెస్టును ఇంగ్లాండ్ సెప్టెంబరు 7వ తేదీ లండన్‌లోని కెన్నింగ్‌టన్ వేదికగా ఆడనుంది.
జట్టు వివరాలు:
Alastair Cook, Keaton Jennings, Joe Root (c), Jonny Bairstow, Ben Stokes, Jos Buttler (wk), Moeen Ali, Sam Curran, Adil Rashid, James Anderson, Stuart Broad, Chris Woakes, Ollie Pope
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications