Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా గెలుపు కష్టమయ్యేది: పాండ్యాపై ప్రశంసలు, కోహ్లీ సంతోషం

Virat Kohli Lauds Entire Team For Showing Character In Decider
England Vs India 3rd T20I: Virat Kohli lauds entire team for showing character in decider

హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకోవడంలో బౌలర్లు కీలకంగా వ్యవహారించారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‍‌లో తొలుత భారీగా పరుగులిచ్చిన బౌలర్లు, ఆతర్వాత ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన విధానంపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. పది ఒవర్లు ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు.

England Vs India 3rd T20I: Virat Kohli lauds entire team for showing character in decider

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఇంగ్లండ్‌ మొదటి పది ఓవర్ల ఆట మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అదే ఫామ్‌ను వారు చివరి వరకు కొనసాగించి ఉంటే 225-230 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచేవారు. ఒకవేళ ఇదే స్కోరును ఇంగ్లండ్‌ నమోదు చేసి ఉంటే మా గెలుపు కష్టమయ్యేది" అని అన్నాడు.

1
42370
ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం అభినందనీయం

ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం అభినందనీయం

"మా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు సాధించి ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం అభినందనీయం. ఇక్కడ మా బౌలింగ్‌లో నాణ్యత కొట్టొచ్చినట్లు కనబడింది. వికెట్‌ టేకింగ్‌ బంతులతో ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ప్రధానంగా హార్దిక్‌ పాండ్యా ఆకట్టుకున్న తీరు అద్భుతం" అని కోహ్లీ అన్నాడు.

జట్టు విజయంలో పాండ్యా కీలకపాత్ర

జట్టు విజయంలో పాండ్యా కీలకపాత్ర

"అతనొక మంచి ఆల్‌ రౌండర్‌ అనే విషయాన్ని పాండ్యా మరోసారి నిరూపించుకున్నాడు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో మా బ్యాట్స్‌మన్‌ ఎంజాయ్‌ చేస్తూ పరుగులు చేశారు. దాంతోనే దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగా ఛేదించాం" అని కోహ్లీ వెల్లడించాడు.

7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

బ్రిస్టల్‌లో ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన చివరి మ్యాచ్‌లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది. 199 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించగా.. రోహిత్‌శర్మ (100 నాటౌట్) సెంచరీతో విజృంభించడంతో మరో 8 బంతులుండగానే లక్ష్యాన్ని చేధించింది.

రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ అవార్డు

రోహిత్‌ శర్మకు మద్దతుగా కెప్టెన్ కోహ్లీ (43), హార్దిక్ పాండ్యా (33) చెలరేగారు. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరిమ్యాచ్‌తోపాటు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మ మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

Story first published: Monday, July 9, 2018, 14:37 [IST]
Other articles published on Jul 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+