
సెంచరీ చేసిన భారత రెండో క్రికెటర్‌గా:
ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన రోహిత్ శర్మ (100) 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో టీ20ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు 1,986 పరుగులతో ఉన్న రోహిత్.. తాజా సెంచరీతో 2,086 పరుగులతో నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లి మాత్రమే 2,102 పరుగులను పూర్తి చేశాడు.

రోహిత్ శర్మతో కలిపి మొత్తం ఐదుగురు
టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మతో కలిపి మొత్తం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ హిట్టర్లు మార్టిన్ గప్తిల్ (2,271), బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (2,121) మూడో స్థానంలో.. తర్వాత విరాట్ కోహ్లి (2,102), రోహిత్ శర్మ (2,086) కొనసాగుతున్నారు.

20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జేసన్ రాయ్ (67) 31 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ ఛేదించే ఉద్దేశ్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన.. రోహిత్ శర్మ (100) 56 బంతుల్లో 11ఫోర్లు, 5సిక్సులు అజేయ సెంచరీ బాదడంతో భారత్ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది.

ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం
దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. టీమిండియా తన తదుపరి సిరీస్‌లో భాగంగా గురువారం మొదటి వన్డే ఆడనుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు తొలి మ్యాచ్‌కు నాటింగ్‌షైర్ స్టేడియం వేదిక కానుంది.


Click it and Unblock the Notifications














