Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs India: 4th Test, Day 1: నమోదైన రికార్డులివే

England vs India, 2018: 4th Test, Day 1 – Statistical Highlights

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మాదిరే నాలుగో టెస్టులో కూడా కోహ్లీసేన ఆధిపత్యం మొదలైంది. ఆ టెస్టులో బ్యాట్స్‌మెన్ సత్తా చాటితే, ఈ టెస్టులో పేసర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

రెండో ఓవర్‌ మొదటి బంతికే ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఇంగ్లండ్‌ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. దీంతో మూడో సెషన్‌కు ముందే ఇంగ్లండ్‌ ఆట కట్టేసేలా కనిపించింది.

కానీ, ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మన్ శామ్ కర్రన్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. ఏ వందకో, 150 స్కోరుకో ముగిసే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చాడు. మొయిన్‌ అలీతో కలిసి కర్రన్ ఏడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ వెనుదిరగడంతో ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లలో సామ్‌ క్యూరన్‌(78), మొయిన్‌ అలీ(40) పరుగులు చేశారు. దీంతో నాలుగో టెస్టు మొదలైన రోజే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, షమీలు తలో రెండు వికెట్లు తీశారు.

హార్ధిక్‌ పాండ్యాకు ఒక వికెట్‌ దక్కింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ముగిసే సరికి 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగో టెస్టు మొదటి రోజు అనేక రికార్డులు నమోదయ్యాయి.

1
42377

నాలుగో టెస్టు మొదటిరోజు నమోదైన రికార్డులు:


* 5 - భారత్ తరుపున ఐదుగురు బౌలర్లు తొలిసారి ఓ టెస్టు సిరిస్‌లో 10 అంతకుమించి వికెట్లను పడగొట్టారు. నలుగురు భారత పేసర్లు పదికిపైగా వికెట్లను ఓ టెస్టు సిరిస్‌లో తీయడం కూడా ఇదే మొదటిసారి.


* 20ఏళ్ల 88రోజులు - ఓ టెస్టు సిరిస్‌లో ఎనిమిది లేదా అంతకన్నా తక్కుువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా రెండో హాఫ్ సెంచరీని చేసిన యువ ఆటగాడిగా 20 ఏళ్ల 88 రోజుల శామ్ కర్రన్ నిలిచాడు. 1979/80 హోం సిరిస్‌లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ 21 ఏళ్ల 11 రోజుల వయసులో పాకిస్థాన్‌పై తన రెండో టెస్టు హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.


* 23 - నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ డే రోజున టీమిండియా 23 ఎక్స్‌ట్రాలను బైల రూపంలో ఇచ్చింది. గత 100 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో తొలిరోజున ఏ జట్టూ ఇన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వలేదు. 1964లో కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత జట్టు మొత్తం 40 ఎక్స్‌ట్రాలు(29 బైలు, 9 లెగ్ బైలు, 2 నో బాల్స్) రూపంలో ఇచ్చింది.


* 39 - 39వ టెస్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ తొలిసారి తుది జట్టును మార్చకుండా బరిలోకి దిగాడు. దీంతో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తన నాయకత్వంలో 43 టెస్టుల వరకు తుది జట్టును మార్చుతూనే ఉన్నాడు.


* 86 - ఇషాంత్ శర్మ 250 వికెట్లను తన 86వ మ్యాచ్‌లో అందుకున్నాడు. అత్యంత నిదానంగా 250 వికెట్లను తీసిన భారత బౌలర్‌గా ఇషాంత్ నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ఆటగాడు జాక్వస్ కల్లిస్ టెస్టు క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకునేందుకు 127 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.


* 200 - అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అందుకున్న క్యాచ్‌ల సంఖ్య. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 200కుపైగా క్యాచ్‌లు అందుకున్న నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి ముందు రాహుల్ ద్రవిడ్, అజాహరుద్దీన్, సచిన్ టెండూల్కర్‌లు ఈ ఘనత సాధించారు.

Story first published: Friday, August 31, 2018, 15:54 [IST]
Other articles published on Aug 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+