Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2022: తొలి రోజు వ‌రుణుడిదే పై చేయి.. 3 వికెట్లు తీసిన ఇంగ్లండ్

England vs Australia: Rain Dominated in Sydney Test Match First Day Game

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో వ‌రుణిడిదే పై చేయి అయింది. వ‌ర్షం ప‌లు మార్లు అడ్డుప‌డ‌డంతో ఆట స‌జావుగా సాగ‌లేదు. తొలి రోజు 46.5 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా త‌మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మ‌ధ్య‌లో వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. దీంతో 30 ప‌రుగుల వ‌ద్దే అంటే ముందుగానే అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు.

భాగ‌స్వామ్యానికి బ్రేక్

భాగ‌స్వామ్యానికి బ్రేక్

లంచ్ బ్రేక్ త‌ర్వాత ప్రారంభ‌మైన ఆట‌లో ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్, మార్క‌స్ హారీస్ 50 ప‌రుగుల భాగ‌స్వామ్యన్ని పూర్తి చేశారు. అయితే ఆ వెంట‌నే జ‌ట్టు స్కోర్ 51 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా డేవిడ్ వార్న‌ర్‌ను ఇంగ్లండ్ పేస‌ర్ స్టూవ‌ర్ట్ బ్రాడ్ ఔట్ చేశారు. 6 ఫోర్ల‌తో 72 బంతుల్లో 30 ప‌రుగులు చేసిన వార్న‌ర్.. బ్రాడ్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే ఆ కాసేప‌టికే మ‌ళ్లీ వ‌ర్షం రావ‌డంతో అంపైర్లు స‌మ‌యానికి కంటే ముందే టీ బ్రేక్ ఇచ్చారు. ఆ స‌మ‌యానికి ఆస్ట్రేలియా స్కోర్ 56-1.

టీ బ్రేక్ త‌ర్వాత 2 వికెట్లు డౌన్

టీ బ్రేక్ త‌ర్వాత 2 వికెట్లు డౌన్

ఆ త‌ర్వాత వ‌ర్షం ఆగిపోవ‌డంతో మ్యాచ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్ మార్క‌స్ హారిస్‌, ల‌బుశేన్ క‌లిసి రెండో వికెట్‌కు 55 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోర్ 111 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 38 ప‌రుగులు(4 ఫోర్లు) చేసిన హారిస్‌ను అండ‌ర్స‌న్ ఔట్ చేశాడు. కాసేప‌టి త‌ర్వాత జ‌ట్టు స్కోర్ 117 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 28 ప‌రుగులు(4 ఫోర్లు) చేసిన ల‌బుషేన్‌ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు.

కాసేప‌టి త‌ర్వాత వ‌రుణుడు మ‌ళ్లీ అడ్డుప‌డ్డాడు. ఇక‌ మ‌ళ్లీ ఆగ‌క‌పోవ‌డంతో కాస్త ముందుగానే అంపైర్లు తొలి రోజు ఆట‌ను ముగించారు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో 6 ప‌రుగుల‌తో స్మిత్, 4 ప‌రుగుల‌తో ఖ‌వాజా ఉన్నారు. ఇంగ్లీష్ బౌల‌ర్ల‌లో బ్రాడ్, అండ‌ర్స‌న్‌, వుడ్ త‌లో వికెట్ తీశారు. ఇలా ప‌లుమార్లు వ‌రుణుడు అడ్డుప‌డ‌డంతో 46.5 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది.

Ashes 2021 - 2022 : ఆటగాళ్లకు Cricket Australia నయా రూల్స్
 బ్రాడ్ రికార్డు

బ్రాడ్ రికార్డు

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఇంగ్లండ్ పేస‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు టెస్టు క్రికెట్‌లో వార్న‌ర్‌ను బ్రాడ్ 13 సార్లు ఔట్ చేశాడు. తద్వారా వార్న‌ర్‌పై బ్రాడ్ త‌న అధిప‌త్యాన్ని కొన‌సాగించాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో వార్న‌ర్‌ను ఎక్కువ సార్లు ఔట్ చేసిన రికార్డును బ్రాడ్ కొన‌సాగించాడు. బ్రాడ్ త‌ర్వాత వార్న‌ర్‌ను అత్య‌ధికంగా అశ్విన్, అండ‌ర్స‌న్ ప‌దేసి సార్లు ఔట్ చేశారు.

Story first published: Wednesday, January 5, 2022, 14:17 [IST]
Other articles published on Jan 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+