ENG vs AUS Playing 11: ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ.. హోరాహోరీ తప్పదు! హ్యాట్రిక్ విజయం ఎవరిదో? తుది జట్లు ఇవే!!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా ఉన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచులో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడనుండగా.. మరో మ్యాచులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో అభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చోడొచ్చు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

పిచ్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు 19 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 8 మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. ఒక మ్యాచులో మాత్రం ఫలితం తేలలేదు. రెండు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించాయి. 2010 ఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో తలపడడం చివరిసారి. ఈరోజు మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ వేదికపై ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేయడం పిచ్‌పై కలిసొస్తుంది. బ్యాటర్లు కూడా ఇక్కడ పరుగులు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. టాస్ కూడా కీలకంగా కానుంది. మంచు కారణంగా బౌలింగ్ చేయడం కష్టం అవుతుంది. టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

చెలరేగుతున్న రాయ్:
ఇంగ్లండ్ తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. బంగ్లాదేశ్ జట్టు ఇంగ్లండ్ దెబ్బకు పూర్తిగా తేలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు బంగ్లాదేశ్ జట్టును 124 పరులకే పరిమితం చేశారు. జేసన్ రాయ్ (38 బంతుల్లో 61) చెలరేగడంతో చెలరేగడంతో 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లీష్ జాతు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రోజు కూడా రాయ్ చెలరేగాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి హిట్టర్లు ఇంగ్లండ్ సొంతం. మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్ లాంటి నాణ్యమైన బౌలింగ్ కూడా ఇంగ్లీష్ జట్టుకు ఉంది. మార్క్ వుడ్, టామ్ కుర్రాన్‌లు ఇప్పటివరకు రెండు గేమ్‌లు ఆడలేదు. ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉందని ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. వీరిద్దరూ ఆడతారా లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఫామ్‌లోకొచ్చిన వార్నర్:
3 ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా కూడా ఈ పోటీలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్.. ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఫామ్ అందుకున్నాడు ఇక స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సూపర్ 12 దశలలో మంచి టచ్‌లో ఉన్నాడు. ఆడిన 2 ఇన్నింగ్స్‌లలో వరుసగా 35 మరియు 28 పరుగులు చేశాడు. స్మిత్, వార్నర్, ఫించ్ మంచి టచ్‌లో ఉండటంతో ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.

తుది జట్లు (అంచనా):
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications