Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్: ఆరోన్ ఫించ్ సెంచరీ, ఈ టోర్నీలో రెండోది

Aaron Finch

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 115 బంంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో సెంచరీని సాధించాడు. ఈ టోర్నీలో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, సెంచరీ చేసిన ఆనందం ఫించ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్ మూడో బంతికి క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 116 బంతులను ఎదుర్కొన్న ఫించ్ సరిగ్గా 100 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు.

ప్రస్తుతం 37 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ మ్యాక్స్‌వెల్(1), స్టీవ్ స్మిత్(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 173 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా(23) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

1
43675

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసీస్‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించాడు. దీంతో ఓపెనర్లు ఆరోన్ ఫించ్-డేవిడ్ వార్నర్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 123 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్(53) పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు.

{headtohead_cricket_2_1}

Story first published: Tuesday, June 25, 2019, 17:45 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+