
హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 116 బంతుల్లో 100(11 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో చెలరేగగా... డేవిడ్ వార్నర్ 61 బంతుల్లో 53(6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 286 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో ఓపెనర్లుగా ఆరోన్ ఫించ్-డేవిడ్ వార్నర్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 123 పరుగులు జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్(53) పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆరోన్ ఫించ్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖావాజాను స్టంపౌట్ చేసే అవకాశాన్ని బట్లర్ వృథా చేశాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 173 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా(23) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
ఆరోన్ ఫించ్‌కు జోడీగా స్మిత్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులో కుదురుకున్న ఫించ్‌కు స్మిత్ చక్కటి సహకారం అందించడంతో దూకుడుగా ఆడుతూ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఆరోన్ ఫించ్ 115 బంంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో సెంచరీని సాధించాడు. ఈ టోర్నీలో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
అయితే, సెంచరీ చేసిన ఆనందం ఫించ్‌కు ఎంతో సేపు నిలవలేదు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్ మూడో బంతికి క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓవైపు స్మిత్ నెమ్మదిగా ఆడుతుండగా మరో ఎండ్‌లో బ్యాటింగ్ వచ్చిన మాక్స్‌వెల్(12), స్టాయినిస్(8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపడంతో స్టీవ్ స్మిత్(38) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. చివర్లో అలెక్స్ కేరీ 27 బంతుల్లో 38(5ఫోర్లు) దూకుడుగా ఆడటంతో
ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది.
{headtohead_cricket_2_1}