Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs AUS: బ్రూక్ విధ్వంసకర సెంచరీ..ఆస్ట్రేలియా రికార్డుకు బ్రేక్!

పోటీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తాచాటింది. అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో ఆసీస్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగులు చేసింది. అలెక్స్ కేరి (77 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), స్టీవ్ స్మిత్ (60; 82 బంతుల్లో, 5 ఫోర్లు), హార్డీ (44; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. జోఫ్రా ఆర్చర్ రెండు, బెథెల్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, బ్రైడన్ తలో వికెట్ తీశారు.

England vs Australia Harry Brook Smashes Maiden ODI Century to Keep Series Hopes Alive

అనంతరం భారీ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 37.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. అయితే ఈ దశలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అంతేగాక వరుణుడు దోబూచులాడాడు. మ్యాచ్ కొనసాగడం కష్టమని భావించిన అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఆ సమయానికి 46 పరుగుల ముందంజలో ఉన్న ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.

హ్యారీ బ్రూక్ (110 నాటౌట్, 94 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో చెలరేగాడు. విల్ జాక్స్ (84; 82 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) కూడా చెలరేగాడు. లివింగ్‌స్టోన్ (33 నాటౌట్; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే ఈ ఓటమితో ఆస్ట్రేలియా వరుస 14 విజయాలకు బ్రేక్ పడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో లీగ్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం వరుస విజయాలతో ఆస్ట్రేలియా హొరెత్తించింది. కప్‌ను గెలిచిన ఆసీస్ అక్టోబర్-2023 నుంచి సెప్టెంబర్-2024 వరకు జైత్రయాత్ర కొనసాగించింది. వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో శ్రీలంక (13)ను దాటి రెండో స్థానంలోనూ ఆస్ట్రేలియానే నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డుకు బ్రేక్ పడింది. 2003లో ఆసీస్ వరుసగా 21 వన్డేలు గెలిచింది.

Story first published: Wednesday, September 25, 2024, 9:13 [IST]
Other articles published on Sep 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+