వార్నర్ డకౌట్: ఆదుకున్న స్మిత్, లంచ్ విరామానికి ఆసీస్ 98/2

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు నిరాశపరిచారు. దీంతో లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా 98/2 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లాబుస్చాగ్నే(49), స్టీవ్ స్మిత్(28) పరుగులతో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జట్టు స్కోరు ఒక పరుగు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో పరుగులు రాబట్టేందుకు చాలాసేపు ఇబ్బందిపడిన డేవిడ్ వార్నర్... స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
28 పరుగులకే రెండు వికెట్లు
అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లాబుస్చాగ్నే నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. మరో ఓపెనర్ మార్కస్ హారిస్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 28 పరుగుల వద్ద మరో ఓపెనర్ మార్కస్ హారిస్(13) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆదుకున్న స్టీవ్ స్మిత్
దీంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూ అనవసర షాట్లకు పోకుండా మార్నస్ లాబుస్చాగ్నేతో కలిసి లంచ్ విరామం వరకు మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన లాబుస్చాగ్నే
ఈ క్రమంలో మార్నస్ లాబుస్చాగ్నే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కాగా, ఆస్ట్రేలియా కోల్పోయిన రెండు వికెట్లు స్టువర్ట్ బ్రాడ్‌కే దక్కాయి. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది.
ఇరు జట్లకు ఎంతో కీలకం
ఇక, ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్‌ను సమం అయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే గత సిరీస్ విజేత అదే కాబట్టి ట్రోఫీ ఆసీస్ సొంతమవుతుంది. దీంతో చివరి టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications