న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా: 4th Test డ్రీమ్ 11 అంచనా, పాంటసీ టిప్స్!

 England vs Australia 4th Test Ashes 2019: Dream11 Prediction, Playing XI Updates & Fantasy Cricket Tips

హైదరాబాద్: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీడ్స్ టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో టెస్టులో ఆడేందుకు ఫిట్‌నెట్ సాధించగా... ఈ సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఉస్మాన్ ఖవాజాకు ఈ మ్యాచ్‌లో చోటు దక్కడం కష్టమే.

చేజారిన అరుదైన రికార్డు: యుఎస్ ఓటమిపై రోజర్ ఫెదరర్ ఇలాచేజారిన అరుదైన రికార్డు: యుఎస్ ఓటమిపై రోజర్ ఫెదరర్ ఇలా

ఉస్మాన్ ఖవాజా ఈ సిరిస్‌లో ఇప్పటివరకు మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి 122 పరుగులతో నిరాశపరిచాడు. ఈ పర్యటనలో ఇప్పటివరకు నమోదైన ఖవాజా అత్యధిక స్కోరు 40. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో మార్నస్ లాబుస్చాగ్నే బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో దిగనున్నాడు.

అగ్రస్థానంలో స్టీవ్ స్మిత్

అగ్రస్థానంలో స్టీవ్ స్మిత్

కాగా, మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 904 రేటింగ్‌ పాయింట్లతో స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా.. 903 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. విండిస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను చేజార్చుకున్నాడు.

ప్రతిష్టాత్మకంగా మారిన నాలుగో టెస్టు

ప్రతిష్టాత్మకంగా మారిన నాలుగో టెస్టు

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్ తిరిగి యాషెస్ బరిలో నిలిచింది. ప్రస్తుతం ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇంగ్లాండ్ తుది జట్టు:

జో డెన్లీ, రోరే బర్న్స్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, క్రెయిగ్ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్.

ఆస్ట్రేలియా తుది జట్టు

డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లాబుస్చేంజ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, టిమ్ పైన్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజెల్వుడ్.

4వ టెస్టులో ఎంచుకోవాల్సిన డ్రీమ్11 జట్టిదే:

4వ టెస్టులో ఎంచుకోవాల్సిన డ్రీమ్11 జట్టిదే:

బ్యాట్స్ మెన్: రోరే బర్న్స్, జో రూట్, మార్నస్ లాబుస్చేంజ్, స్టీవ్ స్మిత్

వికెట్ కీపర్: జానీ బెయిర్‌స్టో

ఆల్ రౌండర్: బెన్ స్టోక్స్

బౌలర్లు: జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్

Story first published: Wednesday, September 4, 2019, 13:22 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X