For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోర్గాన్ సిక్సర్ల వర్షం: ఆప్ఘనిస్థాన్ విజయ లక్ష్యం 398

England vs Afghanistan Live Score, World Cup 2019: Eoin Morgan 148 powers England to 397/6

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ మోర్గాన్ 71 బంతుల్లో 148(4 ఫోర్లు, 17 సిక్సులు) సెంచరీతో చెలరేగగా... జానీ బెయిర్ స్టో 99 బంతుల్లో 90(8 పోర్లు, 3 సిక్సులు), జో రూట్ 82 బంతుల్లో 88(5 ఫోర్లు, సిక్స్)తో హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మొత్తం 25 సిక్సుర్లు బాదారు. ఒక ఇన్నింగ్స్‌లో ఓ జట్టు బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం విశేషం. దీంతో పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుకు 398 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, జాద్రన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

1
43667
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జేమ్స్‌ విన్సే-బెయిర్‌ స్టోలు ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్‌ స్టోతో జో రూట్‌ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్‌ స్టో(90) ఔటయ్యాడు.

మోర్గాన్‌ ఆరంభం నుంచే దూకుడుగా

బెయిర్‌ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్‌ దానిని సెంచరీగా మలచేందుకు ఆ తర్వాత 21 బంతుల్నే తీసుకున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ

వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ. ఈ క్రమంలో మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు.

అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు

ఈ క్రమంలోనే ఓవరాల్‌ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు బాదిన రికార్డును కూడా మోర్గాన్ సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో క్రిస్ గేల్‌, రోహిత్ శర్మ, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్‌లు బాదిన 16 సిక్సులే ఇప్పటివరకు అత్యధికం. ఈ మ్యాచ్‌లో 17 సిక్సులు బాది మోర్గాన్ ఆ రికార్డుని అధిగమించాడు. 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.

సిక్సర్ల వర్షం

అంతకముందు జోరూట్‌(88) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ మూడో వికెట్‌కు 189 పరుగులు, నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మోర్గాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్(2), స్టోక్స్(2) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లను చేజార్చుకోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

Story first published: Tuesday, June 18, 2019, 19:06 [IST]
Other articles published on Jun 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+