టి20 ప్రపంచ కప్: విజేత ఇంగ్లాండు

లక్ష్య ఛేదనలో 7 పరుగుల వద్దే ఓపెనర్ లంబ్ వికెట్ కోల్పోయినా ఇంగ్లాండ్ వెనకడుగు వేయలేదు. మరో ఓపెనర్ కీస్వెటర్, పీటర్సన్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. నానెస్ వేసిన మూడో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన కీస్వెటర్ తర్వాత ఏ బౌలర్‌నూ వదల్లేదు. మరోవైపు పీటర్సన్ చక్కని స్ట్రోక్ ప్లేతో అలరించాడు. క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. చివరికి 14వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటకి స్కోరు 118. వెంటనే కీస్వెటర్‌ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్‌పై ఆసీస్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ కాలింగ్ వుడ్ (12 నాటౌట్), మోర్గాన్ (15 నాటౌట్)లు కంగారూలకు ఎలాంటి అవకాశమివ్వలేదు. లక్ష్యాన్ని చాలా అలవోకగా ఛేదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అదీ 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ కాలింగ్‌వుడ్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ విలవిల్లాడింది. ఓవర్‌కో వికెట్ చొప్పున తొలి మూడు ఓవర్లలో 10 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. అత్యంత ప్రమాదకర ఓపెనర్లు వార్నర్ (2), వాట్సన్ (2), ఆ తర్వాత హడిన్ (1) పెవిలియన్ బాటపట్టారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సైడ్‌బాటమ్ తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి వాట్సన్, హడిన్‌లను ఔట్ చేయగా, వార్నర్ రనౌటయ్యాడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా కెప్టెన్ మైకెల్ క్లార్క్ (27; 27 బంతుల్లో 2X4) పరిస్థితిని కాస్త చక్కదిద్దాడు. డేవిడ్ హసితో కలిసి ఒకట్లు, రెండ్లు తీస్తూ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఐతే పదో ఓవర్లో స్వాన్ బౌలింగ్‌లో కాలింగ్‌వుడ్ ఎడమవైపు దూకుతూ అందుకున్న కళ్లు చెదిరే క్యాచ్‌కు నిష్క్రమించాడు.
ఆ దశలో ఆసీస్ స్కోరు 150కి చేరువవుతుందని కూడా అనుకోలేదు. కానీ టోర్నీలో ఇంతకుముందు కొన్ని మ్యాచ్‌ల్లోలాగే ఆసీస్ అద్భుతంగా పుంజుకుంది. ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైట్ (30; 19 బంతుల్లో 4X4, 1X6) ఆసీస్‌ను మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చాడు. అప్పటికిదాకా నెమ్మదిగా ఆడిన డేవిడ్ హసి (59; 54 బంతుల్లో 2X4, 2X6) కూడా బ్యాట్ ఝుళిపించడం మొదలుపెట్టాడు. యార్డీ వేసిన 13వ ఓవర్లో వైట్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. డేవిడ్ హసి కూడా సిక్స్ బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులొచ్చాయి. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టిన వైట్ అదే ఊపులో ఆడబోయి 16వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 95/5. ఆ తర్వాత చక్కని షాట్లు ఆడిన డేవిడ్ హసీ, మైకెల్ హసీ సోదరులు (10 బంతుల్లో 17)తో కలిసి మరో ఉపయుక్తమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. చివరి 10 ఓవర్లలో ఆసీస్ 100 పరుగులు రాబట్టారు. సైడ్‌బాటమ్ (2/26), స్వాన్ (1/17) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వాట్సన్ (సి) స్వాన్ (బి) సైడ్‌బాటమ్ 2; వార్నర్ రనౌట్ 2, మైకెల్ క్లార్క్ (సి) కాలింగ్‌వుడ్ (బి) స్వాన్ 27; హడిన్ (సి) కీస్వెటర్ (బి) సైడ్‌బాటమ్ 1; డేవిడ్ హసి రనౌట్ 59; వైట్ (సి) బ్రాడ్ (బి) రైట్ 30; మైకెల్ హసి నాటౌట్ 17; స్మిత్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 147
వికెట్ల పతనం: 1-2, 2-7, 3-8, 4-45, 5-95, 6-142
బౌలింగ్: సైడ్ బాటమ్ 4-0-26-2; బ్రెస్నన్ 4-0-35-0; బ్రాడ్ 4-0-27-0; స్వాన్ 4-0-17-1; యార్డీ 3-0-34-0; రైట్ 1-0-5-1
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: లంబ్ (సి) డేవిడ్ హసి (బి) టెయిట్ 2; కీస్వెటర్ (బి) జాన్సన్ 63; పీటర్సన్ (సి) వార్నర్ (బి) స్మిత్ 47; కాలింగ్ వుడ్ నాటౌట్ 12; మోర్గాన్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (17 ఓవర్లలో 3 వికెట్లకు) 148
వికెట్ల పతనం: 1-7, 2-118, 3-121
బౌలింగ్: నానెస్ 4-0-29-0; టెయిట్ 3-0-28-1; జాన్సన్ 4-0-27-1; స్మిత్ 3-0-21-1; వాట్సన్ 3-0-42-0
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications